1. హర్భజన్ సింగ్ (భారత్): భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ వింత రికార్డులో మొదటి స్థానంలో ఉన్నాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్‌లో భజ్జీ మొత్తం 236 మ్యాచ్‌లు ఆడి 1237 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ కానీ, అర్ధ సెంచరీ కానీ లేదు. వన్డేల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 49 పరుగులు. తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న హర్భజన్, బౌలింగ్‌లో మాత్రం 269 వికెట్లు తీసి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు.