Headlines

Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!


Team India Squad Changes: వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఈ సిరీస్‌లో బ్యాకప్ ఆటగాడిగా జట్టు యాజమాన్యం సువర్ణావకాశం కల్పించింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇషాన్ తీవ్రంగా తడబడ్డాడు. ఆడిన రెండు మ్యాచుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మిడిల్ ఆర్డర్‌లో అతడు వరుసగా విఫలం కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. రాబోయే రోజుల్లో సెలెక్టర్లు రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉండటంతో ఇషాన్ వన్డే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఆల్‌రౌండర్లుగా నిరాశపరిచిన సుందర్, శివమ్ దూబే..!

సీనియర్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ వన్డే సిరీస్‌లో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 54 పరుగులు మాత్రమే చేసిన సుందర్, బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు టీ20ల్లో ఆకట్టుకుంటున్న శివమ్ దూబే, వన్డే ఫార్మాట్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దక్కిన అవకాశంలో తొలి బంతికే ‘గోల్డెన్ డక్’గా వెనుతిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు.

ఇది కూడా చదవండి: Video: 6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ.. మోస్ట్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ ధారాళంగా పరుగులు సమర్పణ..!

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి అడుగుపెట్టిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్, మూడో వన్డేలో బౌలింగ్ చేస్తూ తీవ్రంగా తడబడ్డాడు. ఇంగ్లండ్ బ్యాటర్ల దాటికి తట్టుకోలేక 10 ఓవర్లలో ఏకంగా 7.90 ఎకానమీతో 79 పరుగులు సమర్పించుకున్నాడు. విదేశీ పిచ్‌లపై అతడి బౌలింగ్ ప్రభావవంతంగా లేకపోవడంతో మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: తొలి ఓవర్‌లోనే ఊహించని స్పీడ్.. అరంగేట్రంలోనే అదరగొట్టిన గుజరాత్ పేసర్..!

ఇంగ్లండ్ సిరీస్‌లో ఓటమితో పాటు ఈ నలుగురి పేలవ ప్రదర్శన టీమిండియా వన్డే జట్టు ప్రణాళికల్లో పెద్ద మార్పులకు దారితీయనుంది. రాబోయే సిరీస్‌లలో సెలెక్టర్లు కొత్త ముఖాలకు అవకాశాలు ఇస్తే, ఈ నలుగురికీ మళ్లీ భారత వన్డే జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యమే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *