Tablets: టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు.. అంతకు మించి!

Tablets: టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు.. అంతకు మించి!


Tablets: మనం వాడే చాలా రకాల టాబ్లెట్ల మధ్యలో ఒక చిన్న గీత ఉండటాన్ని గమనించే ఉంటారు. చాలా మంది ఇది కేవలం డిజైన్ అనుకుంటారు, కానీ మెడికల్ పరంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. వైద్య భాషలో ఈ గీతను ‘స్కోర్ లైన్’ (Score Line ) అని పిలుస్తారు. అసలు ఈ లైన్ ఎందుకు ఉంటుంది? ఏ మాత్రలను పగలగొట్టి వేసుకోకూడదు? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. సరైన డోసేజ్ కోసం:

న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ ప్రివెంటివ్ హెల్త్ అండ్ వెల్నెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సోనియా రావత్ (Sonia Rawat) తెలిపిన వివరాల ప్రకారం.. మాత్రల మీద ఉండే ఈ స్కోర్ లైన్ (Pill Score Line) ప్రధానంగా ఆ మాత్రను రెండు సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఒక టాబ్లెట్ 500mg శక్తి కలిగి ఉండి, డాక్టర్ మీకు కేవలం 250mg మాత్రమే వేసుకోమని సూచిస్తే.. ఆ గీత ఉన్న చోట విడగొట్టడం ద్వారా మీరు ఖచ్చితమైన డోస్‌ను పొందవచ్చు.

2. అన్ని మాత్రలను విరగ్గొట్టవచ్చా?

ఇక్కడే అసలైన జాగ్రత్త అవసరం. అన్ని మాత్రలకు ఈ గీత ఉండదు. ఏ టాబ్లెట్ల మీద అయితే గీత ఉండదో, వాటిని విరగ్గొట్టి వాడకూడదని అర్థం. ఎందుకంటే సస్టైన్డ్ రిలీజ్. కొన్ని మాత్రలు శరీరంలోకి వెళ్ళాక నెమ్మదిగా కరగాలి. అటువంటి టాబ్లెట్స్‌ను విరగ్గొడితే (Tablet Splitting) మందు ఒక్కసారిగా రక్తంలోకి విడుదలయ్యి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

కోటెడ్ మాత్రలు: కొన్ని మాత్రల మీద ప్రత్యేకమైన పొర ఉంటుంది. వీటిని విడగొడితే లోపల ఉన్న ఔషధం దాని ప్రభావాన్ని కోల్పోవచ్చు.

3. నిపుణుల హెచ్చరిక:

న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ నిపుణులు చెబుతున్న ప్రకారం.. స్కోర్ లైన్ ఉన్న మాత్రలను మాత్రమే సగానికి విరిచి వాడాలి. గీత లేని మాత్రలను బలవంతంగా విరిస్తే అవి సమానంగా విరగవు, దీనివల్ల డోసేజ్ తక్కువ లేదా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

మాత్ర మధ్యలో ఉండే గీత కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు. అది రోగి భద్రతకు సంబంధించినది. మీకు ఏదైనా సందేహం ఉంటే మాత్రను విరగ్గొట్టే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *