Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా

Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా


Sundeep Reddy Vanga: స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా

బ్రో ఐ డోంట్ కేర్.. ఈ డైలాగ్ బాలయ్యకు పడింది గానీ దీనికి సరైన పర్సన్ సందీప్ రెడ్డి వంగా. బేసిక్‌గానే మనోడు మాట్లాడుతుంటే తూటాలు పేలినట్లే ఉంటుంది. తాజాగా దురంధర్ 2 చూసి బాలీవుడ్ మీద విరుచుకుపడ్డారు వంగా. మరి ఈయనకు హిందీ మార్కెట్ అక్కర్లేదా..? సందీప్ కామెంట్స్ ప్రభాస్‌తో చేస్తున్న స్పిరిట్‌పై ప్రభావం చూపిస్తాయా..?సందీప్ రెడ్డి వంగాను రెబల్ రెడ్డి అనాలేమో..? దురంధర్ 2ను మెచ్చుకుంటూనే బాలీవుడ్ నటులు, రైటర్లపై సందీప్ వంగా వేసిన సెటైర్లు హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు. లిబరల్ ముసుగులో ఎన్నో ప్రొపగాండా సినిమాలు చేసిన వాళ్ళంతా.. ఇప్పుడు నిజాలు చెప్తున్న సినిమాలను విమర్శించడం ఏంటని ఆయన నేరుగానే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దురంధర్ 2 సక్సెస్ మీద హిందీ ఇండస్ట్రీ సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబట్టిన సందీప్.. చివర్లో మండుతున్నట్లుంది అంటూ ఘాటు డైలాగ్ పెట్టడం మరింత వివాదంగా మారింది. తమకు నచ్చని సినిమాలను ప్రొపగాండా అంటూ ముద్ర వేస్తున్న వాళ్ళ హిపోక్రసీని ఆయన తన స్టైల్లో చీల్చి చెండాడటం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. నిజానికి సందీప్ వంగా బాలీవుడ్‌పై ఇలా సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు.. కబీర్ సింగ్, యానిమల్‌ నుంచే జరుగుతుంది. ఇప్పుడు వేరే సినిమాపై కూడా ఇలా గళం విప్పడం ఆయన ఆటిట్యూడ్‌కు నిదర్శనంగా నిలుుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో కబీర్ సింగ్ నచ్చలేదన్నవాళ్లకు ఇచ్చి పాడేసారీయన. ఇక దీపిక పదుకొనేతో వివాదం గురించి పరిచయాలు అక్కర్లేదు. ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ హిందీ వాళ్ళతో మాటల యుద్దం చేయడం సందీప్ వంగా సినిమాల మార్కెట్‌కు అంత మంచిది కాదేమో అనేది ఓ వాదన. ఈ వివాదాలు, పదే పదే చేస్తున్న కామెంట్స్ ప్రభాస్ స్పిరిట్‌పై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. కావాలనే టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *