భారతదేశంలోని అత్యంత ఇష్టమైన వేసవి విహార ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ఒకటి. ఇక్కడ మే నెలలో కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తైన పర్వతాలపై మంచు కూడా చూడవచ్చు. మనాలి పర్వతాలు, లోయలు, పారే నదులతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, ట్రెకింగ్ కూడా చేయవచ్చు.