Sugarcane Juice In Summer: చెరకు రసం వీరికి విషంతో సమానం.. పొరబాటున కూడా తాగకూడదు

Sugarcane Juice In Summer: చెరకు రసం వీరికి విషంతో సమానం.. పొరబాటున కూడా తాగకూడదు


Sugarcane Juice In Summer: చెరకు రసం వీరికి విషంతో సమానం.. పొరబాటున కూడా తాగకూడదు

వేసవిలో వేడి తాపం నుంచి ఉపశమనం కోసం ద్రవరూపంలో ఉండే ఆహారం అధిక మంది తీసుకుంటూ ఉంటారు. అందుకే కొబ్బరి నీరు, చెరకు రసం వంటి రకరకాల ఆరోగ్యకరమైన పానీయాలను ఈ కాలంలో తాగుతుంటారు. ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అధిక మంది వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా… చెరకు రసం అందరికీ మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా లేదా పూర్తిగా మానుకోవడం మంచిదని అంటున్నారు. చెరకు రసం ఎవరికి మంచిది కాదో? అది ఎలాంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహం ఉన్నవారికి యమ డేంజర్‌

వైద్యుల ప్రకారం మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగడం చాలా ప్రమాదకరం. ఇందులో సహజ చక్కెర అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. అందువల్ల రక్తంలో షుగర్‌ స్థాయిలను అదుపులో ఉంచుకోలేని వారు దీనిని తాగకపోవడమే మంచిది.

అధిక బరువు

అధిక బరువు (OBC) ఉన్నవారు కూడా చెరకు రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పానీయంలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. వైద్యుల సలహాతో వారానికి ఒకసారి మాత్రమే.. అదీ మితంగా దీనిని తీసుకోవాలి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు

అజీర్ణం, గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి సమస్యలు ఉన్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు ఇది జీర్ణ సమస్యలను తీవ్రతరం చేసి, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

చెరకు రసం సేవించేటప్పుడు గమనించవలసిన విషయాలు

చెరకు రసాన్ని ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా అప్పటికప్పుడు తయారు చేసుకుని తాగాలి. ఖాళీ కడుపుతో తాగడం మానుకోవాలి. అధిక పరిమాణంలో తాగడం ఆరోగ్యానికి హానికరం. కానీ దీని ప్రయోజనం అందరికీ సమానంగా ఉండదు. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహాతో మేరకు మాత్రమే దీనిని తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *