SSC 2026 Notifications: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 3,684 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల.. డైరెక్ట్‌ అప్లికేషన్ లింక్‌ ఇదే

SSC 2026 Notifications: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 3,684 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల.. డైరెక్ట్‌ అప్లికేషన్ లింక్‌ ఇదే


హైదరాబాద్‌, ఏప్రిల్ 27: వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి 2026 సంవత్సరానికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) మూడు వరుస నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ మూడు నోటిఫికేషన్ల కింద మొత్తం 3,734 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV నోటిఫికేషన్‌ 2026

ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV నోటిఫికేషన్‌ కింద 2,919 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిప్యూటీ రేంజర్, ఎల్‌డీసీ, అకౌంటెంట్, నర్సింగ్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్లు, అకౌంటెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, మార్కెటింగ్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, స్టోర్‌ కీపర్‌, టెక్నీషియన్లు, నర్సింగ్‌ ఆఫీసర్‌, క్లర్క్‌ ఫార్మసిస్ట్‌, కోర్ట్‌ మాస్టర్‌ వంటి తదితర పోస్టులున్నాయి. 10వ తరగతి, ఇంటర్, లేదా డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 4, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2026లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్‌ 2026

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ & ‘డి’ కింద 731 వివిధ మంత్రిత్వ శాఖలలో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 24, 2026 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 15, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ నోటిఫికేషన్‌ 2026

ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ నోటిఫికేషన్‌ కింద 84 పోస్టులను భర్తీ చేయనుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల అనువాద విభాగంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కింది డైరెక్ట్‌ లింక్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *