Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..


Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో వరుస పాటలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. ఆమెతోపాటు తన సోదరుడు శివపై సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగ్లీ తనను మోసం చేసిందని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది ఆరోపించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితోపాటు మరో ముగ్గురిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

పోలీసుల సమాచారం ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని.. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు ఆరోపించారు. అయితే కాలం గడుస్తున్నప్పటికీ లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు. తనకు ఫోన్ చేసి మంగ్లీ, ఆమె సోదరుడు శివ బెదిరింపులకు పాల్పడినట్టు పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదులో వెల్లడించారు న్యాయవాది సుబ్బరావు.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

తనను యాక్సిడెంట్ చేసి చంపుతానని మంగ్లీ , ఆమె సోదరుడు బెదిరించినట్టు పోలీసులకు తెలిపారు. తనకు వీరితో ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో ఏ5 గా మంగ్లీ, మిగతా నిందితుల పై కేస్ నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *