Singer Mangli: రూ.10 లక్షలు ఇవ్వలేదని సుబ్బారావు బెదిరించారు: మంగ్లీ సంచలన ప్రకటన

Singer Mangli: రూ.10 లక్షలు ఇవ్వలేదని సుబ్బారావు బెదిరించారు: మంగ్లీ సంచలన ప్రకటన


Singer Mangli: రూ.10 లక్షలు ఇవ్వలేదని సుబ్బారావు బెదిరించారు: మంగ్లీ సంచలన ప్రకటన

సింగర్ మంగ్లీ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో మంగ్లీ తనను 10 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు అడ్వకేట్ సుబ్బారావు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ కోసం తన అడ్వకేట్‌తో కలిసి మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తనపై సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మంగ్లీ. తన కార్యాలయానికి వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశారని..ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో తనను దుర్భాషలాడుతూ బెదిరించారని తన ఫిర్యాదులో ఆరోపించారు మంగ్లీ.

డబ్బుల వసూళ్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంగ్లీ.. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంగ్లీ.. తనకు డబ్బు ముఖ్యం కాదు పాటలు, వ్యక్తిత్వమే ముఖ్యమంటూ స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉంటే దేనికైనా సిద్ధమన్నారు మంగ్లీ. కష్టపడి ఈ స్థాయికి వచ్చా మూలాలను మర్చిపోనని.. మైక్రో ఫైనాన్స్‌ బాధితుల తరపున పోరాడతానని చెప్పారు మంగ్లీ..

మంగ్లీ లైవ్ వీడియో చూడండి..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *