జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శుక్రుడిని ప్రేమ, సౌందర్యం, సంపద, విలాసాలు, సుఖసంతోషాలు, కళలు వంటి అంశాలకు కారకుడిగా పరిగణిస్తారు. శుక్రుడి సంచారం లేదా గమనంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు ఆయా రాశులపై ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నమ్మకం. ఈ క్రమంలో 2026 అక్టోబర్ 3న శుక్రుడు వక్రగతిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు తులా రాశిలో వక్రి అవుతాడు. నవంబర్ 14 వరకు సుమారు 42 రోజుల పాటు వక్రగతిలో కొనసాగుతాడు. ఈ సమయంలో శుక్రుడికి సంబంధించిన ప్రేమ, ఆర్థిక వ్యవహారాలు, కెరీర్, సుఖసౌకర్యాల అంశాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
వృషభ రాశి
వృషభ రాశివారికి శుక్ర వక్రి కాలం ఆర్థిక విషయాలకు సంబంధించి కీలకంగా ఉండే అవకాశముంది. గతంలో ఎదురైన కొన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునే అవకాశముంది. ఆదాయ పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలున్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం నిలిచిపోయిన పనుల్లో కదలిక రావచ్చు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. పరిస్థితులను పూర్తిగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
తుల రాశి
శుక్రుడు స్వరాశి అయిన తులలోనే వక్రి కావడం వల్ల ఈ రాశికి చెందిన వారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుంది. కెరీర్లో ఆశించిన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారి పనితీరుకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు అదనపు మార్గాలను అన్వేషించే అవకాశం కూడా ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం.
ఇవి కూడా చదవండి
మీన రాశి
మీన రాశివారికి శుక్ర వక్రి సమయంలో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ప్రయోజనం కలిగించే అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త పనుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా రావాల్సిన బాకీలు వసూలయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆదాయానికి కొత్త మార్గాలు కనిపించడంతో ఆర్థిక పరిస్థితి మరింత బలపడే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా కెరీర్లో ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు రావచ్చని చెబుతున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉండటంతో మానసికంగా ఉపశమనం కలగవచ్చు.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. వ్యక్తిగతంగా ఫలితాలు తెలుసుకోవాలంటే జన్మతేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది)