School Holidays: విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!

School Holidays: విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!


School Holidays: విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!

School Holidays: విద్యార్థులకు వేసవి హాలిడేస్ రాకముందే వరుస సెలవులు వస్తున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14, 2026 (మంగళవారం) నాడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులకు అధికారిక సెలవు ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు:

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (DoPT) అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విభాగాలు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు, ఆ మహనీయుని సేవలను స్మరించుకునేందుకు ఈ సెలవును కేటాయించారు.

ఏప్రిల్ 14న మూతపడనున్నవి:

ప్రభుత్వ కార్యాలయాలు: అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సెలవు ఉంటుంది. అలాగే విద్యాసంస్థలకు కూడా సెలవే. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసివేయనున్నారు. అలాగే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.

వరుస సెలవుల సందడి – విద్యార్థుల్లో ఉత్సాహం

వేసవి సెలవులు రాకముందే విద్యార్థులకు వరుస సెలవులు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వారం చివరలో వచ్చిన హాలిడేస్ లిస్ట్ ఇలా ఉంది:

ఏప్రిల్ 12 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.

ఏప్రిల్ 13 (సోమవారం): వైశాఖ పౌర్ణమి (పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో లోకల్ హాలిడే).

ఏప్రిల్ 14 (మంగళవారం): అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.

సరిగ్గా పరీక్షల సమయం ముగిసి, వేసవి సెలవులకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడపడానికి లేదా చిన్నపాటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *