Headlines

Ramya Krishnan: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ ఉంది.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు


భారతీయ సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమయ్యే ‘క్యాస్టింగ్ కౌచ్’ అంశంపై సీనియర్ నటి రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దశాబ్దాల పాటు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఇండస్ట్రీలోని చీకటి కోణాలపై, తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలపై అత్యంత నిక్కచ్చిగా మాట్లాడారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నకు రమ్యకృష్ణ ఏమాత్రం తడబడకుండా సూటిగా సమాధానమిచ్చారు. “క్యాస్టింగ్ కౌచ్ అనేది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, భవిష్యత్తులోనూ జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎవరూ లేదని చెప్పలేని అబద్ధం. అంటూ రమ్యకృష్ణ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే, కాలానుగుణంగా అది జరిగే తీరు మారుతుందని, దానిని అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అనే నిర్ణయం మాత్రం వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వేధింపులు కేవలం మహిళలకే పరిమితం కాలేదని, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎదుర్కొంటున్నారని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, కేవలం సినిమా రంగాన్ని మాత్రమే వేలెత్తి చూపడం సరికాదని ఆమె అన్నారు. “సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కావడం వల్ల ఇక్కడ జరిగే విషయాలు త్వరగా బయటకు వస్తాయి, ఎక్కువగా ప్రచారమవుతాయి. నిజానికి బయటి ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ, అన్ని విభాగాల్లోనూ ఇలాంటి దోపిడీ జరుగుతోంది. దానికి కేవలం ‘క్యాస్టింగ్ కౌచ్’ అని పేరు పెట్టడం సరికాదు” అని వ్యాఖ్యానించారు. మహిళలకు ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పుకునే అమెరికా లాంటి దేశాల్లోనే ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయని, అలాంటప్పుడు ఇక్కడ జరగదని ఎలా అనుకుంటామని ఆమె ప్రశ్నించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్ – విలన్‌ మధ్య కొట్లాట.. ఎవ్వరూ తగ్గట్లేగా..

రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. బాలీవుడ్ నటుడి దయనీయ స్థితి

Monalisa Bhosle: చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుందా.. మోనాలిసా ఇప్పుడేం చేస్తోంది

Sudigali Sudheer: సొంత సినిమాను గాలికొదిలేశాడు! సుధీర్ తీరుపై తీవ్ర విమర్శలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *