Ram Charan: వారెవ్వా రామ్ చరణ్.. Esquire కవర్‌ పేజీపై ఆ లుక్‌ చూసారా…?

Ram Charan: వారెవ్వా రామ్ చరణ్.. Esquire కవర్‌ పేజీపై ఆ లుక్‌ చూసారా…?


Ram Charan: వారెవ్వా రామ్ చరణ్.. Esquire కవర్‌ పేజీపై ఆ లుక్‌ చూసారా…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. పాపులర్ ఇంటర్నేషనల్ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ సంచిక ముఖచిత్రంపై ఆయన మెరిసారు. హాంగ్ కాంగ్ వేదికగా జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోషూట్‌లో మెగా పవర్ స్టార్ లుక్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ అల్ట్రా-స్టైలిష్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. RRR తర్వాత ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న చెర్రీ.. ఈ ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీ ఫీచర్‌తో తన ఇమేజ్‌ను మరింత శిఖరాగ్రానికి చేర్చారని చెప్పవచ్చు. టాలీవుడ్ చరిత్రలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న రెండో స్టార్‌గా చరణ్ రికార్డు సృష్టించారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరవగా.. ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలో రామ్ చరణ్ చేరారు. దీంతో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

సోషల్ మీడియా అంతటా ఈ సరికొత్త ఫోటోలనే షేర్ చేస్తూ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఏమాత్రం హాలీవుడ్ స్టార్లకు తీసిపోని విధంగా, ఇంటర్నేషనల్ అప్పీల్‌తో ఆయన ఇచ్చిన ఫోజులు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోషూట్ కోసం వాడిన స్టైలింగ్, చరణ్ ప్రెజెన్స్ చూస్తుంటే హాలీవుడ్ స్థాయి ప్రమాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రపంచ స్థాయి సినీ విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఆయనలోని ఈ గ్లోబల్ అప్పీల్ చూసి ఫ్యాషన్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోతోంది. కేవలం ఈ ఎక్స్‌క్లూజివ్ ఫోటోలే కాకుండా, ఆ మ్యాగజైన్‌కు చరణ్ ఇచ్చిన పూర్తి స్థాయి ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఏయే ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు.

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

ఈ క్రేజీ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కేవలం ఒక్క పాట మినహాయిస్తే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ బ్యాలెన్స్ సాంగ్‌ను చిత్రీకరిస్తూనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ సినిమాను ఏప్రిల్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఆ రోజు మిస్ అయితే జూన్ 25న పెద్ది రావడం పక్కా. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సినిమాపై హైప్ అమాంతం పెంచేశాయి. బుచ్చిబాబు మార్క్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్‌కు, చరణ్ సరికొత్త మాస్ మేకోవర్ తోడవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్‌తో కిక్కిస్తూనే.. ఇటు ‘పెద్ది’ లాంటి సాలిడ్ సినిమాతో థియేటర్లలో దండయాత్ర చేయడానికి సిద్ధమైన చరణ్.. ఈ ఏప్రిల్‌ను ఫ్యాన్స్‌కు ఒక మర్చిపోలేని డబుల్ ట్రీట్‌గా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *