Ram Charan: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రామ్ చరణ్ పెద్ది విడుదల వాయిదా..

Ram Charan: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రామ్ చరణ్ పెద్ది విడుదల వాయిదా..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకీ హైప్ పెరుగుతుంది. ఇందులో చరణ్ పూర్తిగా రగ్గడ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇటీవల విడుదలైన చరణ్ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుుతుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

కాగా పెద్ది రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది, పెద్ది సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా అనౌన్స్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా మారిపోయింది. సినిమా విడుదల ఆలస్యం అవుతుందంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో సినిమా విడుదల ఆలస్యం అవుతుందని తెలిపారు చిత్ర యూనిట్. పెద్ది సినిమాను జూన్ లో విడుదల చేస్తాం అని తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు మూవీ టీమ్. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ పడుతున్నారు.

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *