Headlines

Rajamouli: ఫ్రాన్స్‌లో సింహాద్రి గురించి మాట్లాడిన రాజమౌళి

Rajamouli: ఫ్రాన్స్‌లో సింహాద్రి గురించి మాట్లాడిన రాజమౌళి


ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా వారణాసి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు రాజమౌళి. వేదిక ఏదైనా దాన్ని మహేష్‌ మూవీ ప్రమోషన్స్‌ కోసమే వాడేస్తున్నారు. కానీ రీసెంట్‌గా ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, మరో మూవీ గురించి మాట్లాడారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్ అయిన ఓ సినిమాలో సీన్‌ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఏంటా మూవీ, ఇప్పటికీ డిస్కస్‌ చేసేంతగా ఆ సీన్‌లో ఏముంది..? సింహాద్రి మూవీ అనగానే అందరికీ గుర్తొచ్చేది తారక్ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్. జక్కన్న కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి జూనియర్ ఎన్టీఆర్‌ను టాప్‌ స్టార్‌గా నిలబెట్టింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ విషయంలో జక్కన్నకు తన ఫ్యామిలీతో పాటు, క్రియేటివ్ టీమ్‌తో పెద్ద గొడవే జరిగిందట. ఓ మంచి వాడిని హీరో చంపే సీన్‌ విషయంలో జరిగిన ఆ డిస్కషన్స్‌ గురించి రీసెంట్‌ ఇంటరాక్షన్‌లో రివీల్ చేశారు రాజమౌళి. సినిమాలో హీరోయిన్ భూమిక తండ్రి అయిన భానుచందర్ మంచివాడైనా.. ఓ సీన్‌లో హీరో అతన్ని కాల్చి చంపాల్సి వస్తుంది. తన కథలన్నీ కుటుంబ సభ్యులతోనే చర్చించి లాక్ చేసే రాజమౌళికి ఈ సీన్ దగ్గరే అభ్యంతరం ఎదురైంది. ఒక మంచి వ్యక్తిని హీరో చంపితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. కానీ ఆ ఒక్క సీనే సినిమాకు ప్రాణమని, ఆ ఎమోషన్ వర్కవుట్ అయితే కథ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని రాజమౌళి బలంగా నమ్మారు. అందుకే యూనిట్ అంతా నో చెప్పినా… తాను అనుకున్నట్టుగానే ఆ సీన్‌ను తెరకెక్కించారు. రాజమౌళి పట్టిన పంతం, ఆయన విజన్ ఏమాత్రం వృధా పోలేదు. ఆయన టీమ్ భయపడినట్లుగా ప్రేక్షకులు ఆ సీన్‌ను రిజెక్ట్ చేయలేదు. ఆ ఎమోషన్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడిగా జక్కన్న నమ్మకమే నిజమైంది, సింహాద్రి ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రికార్డులు క్రియేట్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *