Headlines

Railway Jobs 2026: RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తులు ప్రారంభం


రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) వివిధ పారా-మెడికల్ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు (CEN) 05/2026ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 590 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల సంఖ్య: 365
  • ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టుల సంఖ్య: 118
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 43
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-I పోస్టుల సంఖ్యI: 31
  • రేడియోగ్రాఫర్/ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 25
  • ECG టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 4
  • ఆప్టోమెట్రిస్ట్ పోస్టుల సంఖ్య: 2
  • డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 1
  • ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య: 1

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎం, బీఫార్మసీ, డీఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ తదితర సంబంధిత విద్యార్హతలు అవసరం. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు కారు. 2027 జనవరి 1 నాటికి పోస్టును బట్టి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 40 సంవత్సరాల వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 14, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, EBC అభ్యర్థులు రూ.250 చొప్పున ఫీజు చెల్లించాలి. CBT పరీక్షకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం ఫీజులోని మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. CBTలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.44,900 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు రైల్వే నిబంధనల ప్రకారం ఉంటాయి.

ఇవి కూడా చదవండి



ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 15, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 14, 2026.
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2026.
  • దరఖాస్తుల సవరణ: అక్టోబర్ 17 నుంచి 26, 2026 వరకు

ఆర్‌ఆర్‌బీ రైల్వేలో పారా మెడికల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *