Promissory Note: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..

Promissory Note: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..


Promissory Note: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..

డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోటు రాసుకోవడం సర్వసాధారణం. అయితే, దీనిపై సరైన అవగాహన లేకపోతే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. హైకోర్టు అడ్వకేట్ ఒకరు ప్రామిసరీ నోటు రాసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఏంటో తెలిపారు. ప్రామిసరీ నోటును అప్పు తీసుకునే వ్యక్తే తన సొంత చేతిరాతతో రాయాలి. కేవలం సంతకం పెడితే సరిపోదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో “నేను అప్పు తీసుకోలేదు” అని తప్పించుకునే అవకాశం ఉండదు. నోటులో అప్పు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టంగా పేర్కోవాలి. ఉదాహరణకు “కుటుంబ ఖర్చుల కోసం” లేదా “పిల్లల చదువుల కోసం”. ఇలా కారణం రాయడం వల్ల అప్పు తీసుకున్న వ్యక్తి ఒకవేళ మరణించినా, అతని వారసులు ఆ అప్పు తీర్చడానికి చట్టపరంగా బాధ్యులవుతారు.

ప్రామిసరీ నోటు కాలపరిమితి కేవలం మూడేళ్లు మాత్రమే. నోటుపై ఉన్న తేదీ నుంచి మూడు సంవత్సరాలు దాటితే అది చట్టపరంగా చెల్లదు. ఆ గడువు లోపే అప్పు తీర్చాలి లేదా నోటును రిన్యూవల్ చేసుకోవాలి. ఒక రూపాయి రెవెన్యూ స్టాంప్ అంటించి, దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి అడ్డంగా(Cross) సంతకం చేయాలి. స్టాంపు లేకుండా లేదా దానిపై సంతకం లేని నోటుకు న్యాయస్థానంలో విలువ ఉండదు. ప్రామిసరీ నోటుపై ఇద్దరు సాక్షుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పు ఇచ్చేటప్పుడు సాక్షులు సమక్షంలో ఉండటం వల్ల చట్టబద్ధమైన బలం పెరుగుతుంది. అప్పు తీసుకునేవారు ఎప్పుడూ ఖాళీ నోటుపై సంతకం పెట్టకూడదు. మొత్తం వివరాలు, తేదీ, అప్పు తీసుకున్న మొత్తం అన్నీ నింపిన తర్వాతే సంతకం చేయాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల అప్పు ఇచ్చేవారికి రక్షణ ఉంటుంది. అలాగే తీసుకునే వారికి అనవసరమైన మోసాల నుంచి విముక్తి కలుగుతుంది.

ఇది చదవండి: ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే 100 శాతం పక్కా రిజల్ట్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *