Praful Hinge : చరిత్ర సృష్టించిన ప్రఫుల్ హింగే.. ఐపీఎల్ డెబ్యూ ఓవర్‌లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు

Praful Hinge : చరిత్ర సృష్టించిన ప్రఫుల్ హింగే.. ఐపీఎల్ డెబ్యూ ఓవర్‌లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు


Praful Hinge : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక సరికొత్త హిస్టరీ క్రియేట్ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యంగ్ పేసర్ ప్రఫుల్ హింగే తన అరంగేట్రం మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే ప్రదర్శనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, తను వేసిన మొదటి ఓవర్‌లోనే ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ విధర్భా ఎక్స్‌ప్రెస్ ధాటికి రాజస్థాన్ టాప్ ఆర్డర్ కకావికలమైంది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు, బంతిని అందుకున్న ప్రఫుల్ హింగే విధ్వంసం సృష్టించాడు. తొలి బంతికే టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని అదిరిపోయే బౌన్సర్‌తో అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి ప్రమాదకరమైన ధ్రువ్ జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఓవర్ చివరి బంతికి ప్రిటోరియస్‌ను అవుట్ చేయడంతో రాజస్థాన్ స్కోరు 1 పరుగుకే 3 వికెట్లుగా మారింది. కేవలం 6 బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేసిన ప్రఫుల్, ఉప్పల్ మైదానాన్ని ఉర్రూతలూగించాడు.

ఎవరీ ప్రఫుల్ హింగే?

నాగ్‌పూర్‌లో 2002లో జన్మించిన ప్రఫుల్ ప్రకాష్ హింగే, విధర్భా దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన టాలెంట్ కనబరిచాడు. 2024-25 రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలను విధర్భా గెలవడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఎత్తుగా ఉండే ప్రఫుల్, బంతిని వేగంగా వేయడమే కాకుండా మంచి బౌన్స్‌ను రాబట్టగలడు. చెన్నైలోని ప్రతిష్టాత్మక MRF పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన ఇతను, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తన క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ఐపీఎల్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు.

అవకాశం కోసం నిరీక్షణ

మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడిని కేవలం రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. నిజానికి గత మ్యాచ్‌లోనే (పంజాబ్ కింగ్స్‌పై) ఇతను ఆడుతున్నట్లు ప్రకటించినా, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల చివరి నిమిషంలో బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ నిరాశను తన మనసులో ఉంచుకున్న ప్రఫుల్, రాజస్థాన్‌పై వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ స్థానంలో జట్టులోకి వచ్చి, తాను ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *