నాని ప్యారడైజ్ సినిమా చెప్పిన తేదీకి వస్తుందా లేదంటే మరోసారి వాయిదా పడిందా…? రెండు రోజులుగా సోషల్ మీడియాలో దీని గురించే చర్చ బాగా జరుగుతుంది. దీనికి సమాధానం వచ్చేసింది.. మేకర్స్ నుంచి ప్యారడైజ్ రిలీజ్‌కు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.. కాకపోతే దీనికోసం ప్లాన్ A,B రెండూ ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా..? ది ప్యారడైజ్ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హిట్టైతే నాని రేంజ్ మారడం ఖాయం. అయితే సెప్టెంబర్ 24 నుంచి ప్యారడైజ్ మరోసారి వాయిదా పడిందనే వార్తలు వస్తున్న వేళ.. అంతా అబద్ధమే అని కొట్టి పారేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. కచ్చితంగా ఆన్ టైమ్‌లోనే ఆయా షేర్ అంటున్నారాయన.. సెప్టెంబర్ 24 నుంచే జడల్ జమానా షురూ అవుతుందంటున్నారు. ప్యారడైజ్ రిలీజ్ వెనక ప్లాన్ A,B ఉన్నాయి. ఒకవేళ చెప్పినట్లుగా సెప్టెంబర్ 24న నాని సినిమా వస్తే.. అక్టోబర్ 2న రావాల్సిన ఆదర్శ కుటుంబం వారం ఆలస్యంగా 9న రానుంది. ఇది ప్లాన్ A. ప్లాన్ B ఏంటంటే.. ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా టెక్నికల్ రీజన్స్‌తో వాయిదా పడితే అక్టోబర్ 1కి రానుంది ప్యారడైజ్.. అప్పుడు వెంకీ సినిమా చెప్పినట్లుగానే అక్టోబర్ 2నే రానుంది. ఒకవేళ ప్యారడైజ్ వాయిదా పడితే.. ఆదర్శ కుటుంబంతో పోటీ పడాల్సిందే. అలా కాకుండా ఆన్ టైమ్ వస్తే.. నాని కోసం వెంకీ సినిమాను వారం వాయిదా వేస్తారు. ఈ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ అంతా దాదాపు ఒకరే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పుడిక బాల్ ప్యారడైజ్ కోర్టులోనే ఉంది. చూడాలిక.. జడల్ ఆన్‌టైమ్ వస్తాడా లేదంటే ఆదర్శ కుటుంబంతో పోటీ పడతాడా..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP9 ET: డ్రాగన్ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి..
TOP 9 ET News: అప్పుడే 320 కోట్ల బిజినెస్ ఇదెక్కడి అరాచకం సామి.. | NTR క్రేజ్‌కు ఇదొక ఋజువనే చెప్పాలి
New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం
హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు
వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన