ఆ సీఐ నోటి దురుసు! వృద్ధ మహిళపై అసభ్యకర పదజాలం.. వైరల్‌గా మారిన వీడియో
బాపట్ల జిల్లా చీరాల టూటౌన్ సీఐ శశికుమార్ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఓ ఇంటి బయట వృద్ధురాలితో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సీసీ కెమెరాలో నమోదైన ఈ దశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్ చేస్తున్నాయి. చట్టప్రకారం, నైతికంగా ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఘటన పోలీసు శాఖ ప్రతిష్టపై…