ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలైన వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ వార్తల్లో నిలుస్తోంది. ఓటీటీలోకి విడుదలైన వెంటనే ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుందీ థ్రిల్లర్ సిరీస్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్ భువన్ బామ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామెడీ డ్రామా సిరీస్ ‘దింధోరా 2’ను కూడా అధిగమించింది. కేవలం 6 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్న ఈ సిరీస్‌లో మిస్టరీ, భయం, మూఢనమ్మకం, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ అంశాలతో కూడిన కథ ఆడియెన్స్
ను చివరి వరకు కట్టిపడేస్తుంది. ఈ సిరీస్ స్టోరీ కూడా చాలా కొత్తగా, డిఫరెంట్ గా ఉంటుంది. ఐరా అనే మహిళ జీవితం చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఐరా, అంతకుముందు రెండుసార్లు వివాహం చేసుకున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే, అతని ఇద్దరు భార్యలు కూడా అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తారు. దీని కారణంగా, ఆమె భర్తకు కుజదోషం ఉందని, అతడిని పెళ్లి చేసుకున్న వారందరూ చనిపోతారని అక్కడి ప్రజలు అనుకుంటుంటారు. ఆశ్చర్యకరంగా పెళ్లి తర్వాత ఐరా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం మొదలవుతుంది. దీనితో పాటు, ఆమె చుట్టూ కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. వాటికి ఎలాంటి సాధారణ సమాధానం దొరకదు. మొదట్లో ఈ సంఘటనలను మూఢనమ్మకంగా భావించినప్పటికీ, క్రమంగా దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉండవచ్చని ఐరా అనుమానించడం ప్రారంభిస్తుంది. మరి అసలు ఆ ఇద్దరు భార్యలూ నిజంగానే శాపం వల్ల చనిపోయారా లేక దాని వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఆ ఇంట్లో చీకటి రహస్యాలు ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘మాంగ్లిక్’. తెలుగులో కుజదోషం అని అర్థం. బెంగాలీ స్టార్ నటులు సౌమిత్రిష కుండు, గౌరవ్ ఛటర్జీ, సీనియర్ నటి లబోని సర్కార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు కృషాను గంగూలీ దర్శకత్వం వహించారు. బన్యన్ ట్రీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మూఢనమ్మకాల వెనుక ఉన్న చీకటి కోణాలను అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ 2026 నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. విడుదలైన తర్వాత, ఇది ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుని, ప్లాట్‌ఫామ్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి
‘మాంగ్లిక్’ వెబ్ సిరీస్ ట్రైలర్..