Headlines

OTT Movie: ఆ ఊళ్లోకి అడుగుపెడితే బలైపోవాల్సిందే.. OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్

OTT Movie: ఆ ఊళ్లోకి అడుగుపెడితే బలైపోవాల్సిందే.. OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్


OTT Movie: ఆ ఊళ్లోకి అడుగుపెడితే బలైపోవాల్సిందే.. OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే. ఒక ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఊహించని ట్విస్టులు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో సాగే ఈ సినిమా లో హై మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే కథ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఒక రైటర్ చిన్నప్పుడు తను పుట్టి పెరిగిన ఊరుకి తిరిగి వస్తాడు. అయితే అతను వచ్చిన సమయానికే ఆ ఊళ్లో వింత వింత పనులు జరుగుతుంటాయి. ఊరి చివర ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి వచ్చి ఒక పెట్టే పెట్టేసి వెళ్లిపోతాడు. అంతే అప్పటి నుంచి ఆ బిల్డింగ్ నుంచి నుంచి వింత శబ్ధాలు, అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. అలాగే ఆ ఊళ్లో ఉండే పిల్లలు, పెద్దలు ఒక్కొక్కరు అదృశ్యమైపోతుంటారు. కట్ చేస్తే.. అలా మాయమైనోళ్లంతా మళ్లీ చీకటి పడ్డాక రక్తపిశాచుల్లా ఊరి మీద పడతారు. దొరికినోళ్లను దొరికినట్టు కరిచేసి తమ బ్యాచ్ లో కలిపేసుకుంటారు. చివరకు ఆ ఊరంతా ఒక దెయ్యాల కొంపలా మారిపోతుంది. ఊర్లో ఏ ఇంట్లో చూసినా దెయ్యాల గోలే కనిపిస్తుంటుంది. వీటిని చూసిన రైటర్, ఒక డాక్టర్, ఒక కుర్రాడు, టీచర్ కలిపి దెయ్యాల మీద యుద్ధానికి దిగుతారు. మరి చివరికి వీళ్ళంతా రక్త పిశాచులను అదుపు చేస్తారా ? చివరకు ఏమైంది అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

భయంకరమైన సన్నివేశాలు, ఊహించని ట్విస్ట్ లతో ఒంటిలో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు సేలమ్స్ లాట్ (Salem’s Lot) . ఇదొక ఇంగ్లిష్ హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జేమ్స్ వాన్ దీనికి నిర్మాతగా వ్యవహరించగా, ‘ఇట్’ సినిమా రచయిత గ్యారీ డౌబెర్‌మాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్టుగా HBO Max ఓటీటీలో రిలీజైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే మూవీస్ లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ కేవలం ఇంగ్లిష్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. చూడాలనుకునేవారు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *