Headlines

OTT Cinema : ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..


లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ నటుడు కవిన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా రొమాంటిక్ కామెడీ డ్రామా ‘హాయ్’ (Hi). ఆగస్ట్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కొన్ని రోజులకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఓటీటీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను సంస్థ అధికారికంగా ప్రకటించింది. విష్ణు ఎడవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదికైన ‘జీ5’లో స్ట్రీమింగ్ కానుంది. “మీకు ఇష్టమైన రొమాంటిక్ రైడ్‌కి ‘హాయ్’ చెప్పడానికి సిద్ధంగా ఉండండి” అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను జీ5 సంస్థ వెల్లడించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారికి, మళ్లీ చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

‘హాయ్’ చిత్రం ప్రధానంగా రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. చెన్నై నేపథ్యంలో సాగే ఈ కథలో నాయకానాయికలు తమ కుటుంబాలకు దూరంగా ఉన్న సమయంలో చెప్పే కొన్ని అబద్ధాలు, వాటి చుట్టూ అల్లుకున్న వినోదాత్మక సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నయనతార, కవిన్ మధ్య కెమిస్ట్రీ, కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో సీనియర్ నటులు ప్రభు, కె. భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, విటీవీ గణేష్, సత్యన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, నటి సుహాసిని మణిరత్నం ప్రత్యేక పాత్రలో అలరించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

కథ విషయానికి వస్తే.. ఇదొక సింపుల్, ఫీల్-గుడ్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా అనే చెప్పాలి. ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుండగా నయనతార (దేవయాని) ఇష్టం లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెన్నై పారిపోతుంది. మరోవైపు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనే లక్ష్యంతో కవిన్ (మయిల్) కూడా ఎవరికీ చెప్పకుండా మద్రాస్ వచ్చేస్తాడు. అక్కడ వీరిద్దరూ అనుకోకుండా కలుసుకుని, స్నేహితులు అవుతారు. కొన్ని పరిస్థితుల వల్ల సమాజం ముందు భార్యాభర్తలుగా నటించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ అబద్ధం వల్ల వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి, వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేదే సినిమా కథ.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *