Headlines

ODI World Cup: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?


Australia Reshapes ODI Future with New Talent for 2027 World Cup: ప్రస్తుతం అన్ని జట్లు వన్డే ప్రపంచకప్ 2027 కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమ తుది సన్నాహాలను, స్వ్కాడ్ లతో ప్రయోగాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కూడా వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహాల్లో భాగంగా సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్ లను ఆడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆస్ట్రేలియా స్వ్కాడ్ ను కూడా ప్రకటించింది. ఈ జట్టు నుంచి తోపు ప్లేయర్ మార్నస్ లబుషేన్‌కు సెలెక్టర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. దీంతో మార్నస్ వన్డే ప్రపంచకప్ 2027 స్వ్కాడ్ నుంచి అధికారికంగా తప్పించినట్లు తెలుస్తోంది.

తోపు ప్లేయర్‌ను పక్కన పెట్టేశారుగా..

కాగా, సౌతాఫ్రికాలో జన్మించిన మార్నస్ లబుషేన్ 2018 నుంచి ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈక్రమంలో 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత 2 ఏళ్లుగా మార్నస్ లబుషేన్ ఫామ్‌ తో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ 30 ఏళ్ల బ్యాటర్ 2022 నుంచి కేవలం 21.87 సగటుతో రన్స్ సాధించాడు. ఈక్రమంలో మార్నస్ బస్ట్ స్కోర్ 77 నాటౌట్ గా నిలిచింది. ఈ లెక్కలు అతని ప్రస్తుత ఫామ్ ను చెప్పకనే చెబుతున్నాయి. దీంతో మార్నస్ లబుషేన్ ను తుది 17 మంది సభ్యులతో కూడిన టీం నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

వేటు వేయక తప్పలేదు..

ఇదే విషయంపై ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ నుంచి లబుషేన్‌ను తప్పించామన్నాడు. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా మార్నస్ పై వేటు వేయక తప్పలేదన్నాడు. టెస్టుల్లోనూ లబుషేన్ ప్లేస్ కష్టమేనా అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. కాగా, ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ లబుషేన్ తీవ్రంగా నిరాశపరచాడు. అతని ఆటతీరుపై విమర్శలు దారుణంగా వినిపించాయి.

వన్డే ప్రపంచకప్ 2027 కోసం మాస్టర్ ప్లాన్..

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా సెప్టెంబర్ 15 నుంచి జింబాబ్వేతో 3 వన్డేలు, సెప్టెంబర్ 24 నుంచి దక్షిణాఫ్రికాతో 3 వన్డేలు ఆడనుంది. ఈ టూర్ ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

జింబాబ్వే, దక్షిణాఫ్రికా సిరీస్ లకు ఆస్ట్రేలియా వన్డే జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోలీ, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జాష్ హెజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జాష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఒలివి పీక్, మాథ్యూ రెన్సా, బిల్లీ సాన్‌లేక్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *