New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!

New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!


New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!

New WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం, ముఖ్యంగా కార్లలో ప్రయాణించే వారి కోసం ఒక సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు కేవలం మెసేజ్‌లకే పరిమితమైన ‘కార్ ప్లే’ (CarPlay) సదుపాయం, ఇప్పుడు పూర్తి స్థాయి యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ తాకకుండానే వాట్సాప్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

ఏమిటీ కొత్త మార్పు?

సాధారణంగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌ను కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసినప్పుడు ‘కార్ ప్లే’ ఫీచర్ వాడుతుంటారు. తాజాగా విడుదలైన iOS వెర్షన్ 26.13.74 అప్‌డేట్‌తో వాట్సాప్ ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టింది. గతంలో దీనిపై కేవలం మెసేజ్‌లు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి యాప్ లాంటి అనుభూతిని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశం వద్ద ఉంది? భారత్‌ ఏ స్థానంలో? టాప్‌ -5 దేశాలు ఇవే!

కొత్త యాప్‌లో లభించే ప్రధాన ఫీచర్లు:

కాల్ మేనేజ్‌మెంట్: ఇకపై కారు డిస్‌ప్లే స్క్రీన్‌పైనే వాట్సాప్ కాల్స్‌ను స్వీకరించవచ్చు లేదా రిజెక్ట్ చేయవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన ‘కాల్స్’ ట్యాబ్ అందుబాటులో ఉంటుంది.

చాట్, కాల్ హిస్టరీ: మీరు ఇటీవల ఎవరితో మాట్లాడారు. ఎవరి నుండి మెసేజ్‌లు వచ్చాయనే హిస్టరీని కారు స్క్రీన్‌పైనే చూడవచ్చు.

వాయిస్ డిటెక్షన్: మెసేజ్ పంపడానికి టైప్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ డిటెక్షన్ సాయంతో మీరు చెప్పే మాటలను అది టెక్స్ట్‌గా మార్చి మెసేజ్ పంపిస్తుంది (Hands-free reply).

సిరి (Siri) పై తక్కువ ఆధారపడటం: గతంలో ప్రతి చిన్న విషయానికి సిరి వాయిస్ అసిస్టెంట్‌ను వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యాప్ ఇంటర్‌ఫేస్ లోనే అన్ని ఆప్షన్లు ఉండటంతో నేరుగా స్క్రీన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.

ఎలా పనిచేస్తుంది?

మీ ఐఫోన్‌ను బ్లూటూత్ లేదా కేబుల్ ద్వారా కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసినప్పుడు, ఆటోమేటిక్‌గా ఈ వాట్సాప్ ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి: YouTube Channel: AI సాయంతో యూట్యూబ్ ఛానెల్.. ఈ ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్.. భారీ ఆదాయం!

ఇది కూడా చదవండి: AC Servicing: సర్వీసింగ్ చేయించిన తర్వాత కూడా మీ ఏసీ కూలింగ్‌ కావడం లేదా? ఇదే ప్రధాన కారణం కావచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *