Headlines

Naga Chaitanya: ఏడవాలని ఉంటుంది.. కానీ కన్నీళ్లు రావు.. ట్రెక్కింగ్‌లో మనసు విప్పిన నాగచైతన్య


టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం నటిస్తోన్న సినిమా వృషకర్మ. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా యూట్యూబర్ జాస్తితో కలిసి రామగిరి కొండపై ట్రెక్కింగ్ కు వెళ్లారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు ఎనిమిది గంటల పాటు ఆయన అక్కడే గడిపారు. కాలినడకన కోట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూశారు. అలాగే జాస్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తన కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబ జ్ఞాపకాలు, అలాగే రాబోయే చిత్రాలపై ఎంతో ఓపెన్‌గా స్పందించారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి వీడియో నవంబర్ 27న రానుంది.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

చైతూ మాట్లాడుతూ తనకు బాధ కలిగినప్పుడు ఏడవాలని అనిపిస్తుందని, కానీ కన్నీళ్లు రావని అన్నారు. అలాంటప్పుడు లోపల చాలా బాధపడతానని ఆయన అన్నారు. ‘వృషకర్మ’ ఒక మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ కథ అందించారు. ఈ సినిమాకు సుమారు రెండేళ్లు పట్టిందని, చైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రమని సమాచారం. సంగీతం అజనీష్ లోకనాథ్ అందించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

ఈ సినిమాలో చైతన్య సాహసికుడిగా కనిపించనున్నారు. కథానాయిక మీనాక్షి చౌదరి పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పాట ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. పూర్తి పాటను నవంబర్ 7న విడుదల చేశారు. చైతన్య స్టైలిష్ లుక్, డ్యాన్స్ స్టెప్స్ ఈ పాటలో ఆకట్టుకున్నాయి. నటుడిగా నాగచైతన్య భిన్నమైన పాత్రల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు ‘తండేల్’లో నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన పాత్రను పోషించారు. ఇప్పుడు ‘వృషకర్మ’లో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఈ ట్రెక్కింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని కొత్త కోణంలో చూడొచ్చని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *