Headlines

Mutton: మటన్ కొనేటప్పుడు 90శాతం మంది చేసే తప్పు ఇదే.. లైట్ తీసుకుంటే జరిగేది ఇదే..


మాంసాహారులకు అత్యంత ఇష్టమైన వంటకాల్లో మటన్ ముందుంటుంది. ఎంతో రుచిగా వండుకున్నా.. మటన్ తిన్న తర్వాత కడుపునొప్పి రావడం లేదా ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలు కొందరిలో కనిపిస్తుంటాయి. మటన్ కొనుగోలు చేసేటప్పుడు చేసే చిన్నపాటి పొరపాట్లే ఇందుకు ప్రధాన కారణం. తాజా, నాణ్యమైన మటన్‌ను ఎలా గుర్తించాలి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఫ్రెష్ మటన్ ఎల్లప్పుడూ లేత ఎరుపు లేదా గులాబీ రంగులో, కొద్దిగా మెరుస్తూ ఉంటుంది. మరీ ముదురు ఎరుపు, గోధుమ రంగులో ఉన్నా లేదా కాంతిహీనంగా కనిపించినా.. అది నిల్వ చేసింది లేదా పాడైపోయిందని అర్థం. అలాగే మాంసం మెరిసేందుకు కొన్నిసార్లు రసాయనాలు, రంగులు వాడతారు. అసహజమైన మెరుపు లేదా జిడ్డు కనిపిస్తే అలాంటి మాంసానికి దూరంగా ఉండాలి.

వాసన, స్పర్శతో పరీక్షించండి

మంచి మటన్‌కు తేలికపాటి, తాజా వాసన ఉంటుంది. ఘాటైన, పుల్లటి లేదా అసహజ వాసన వస్తే అది చెడిపోయిందని గుర్తించాలి. కొనేటప్పుడు మాంసాన్ని చేతితో మెల్లగా నొక్కి చూడాలి. తాజాగా ఉంటే మృదువుగా ఉండి వెంటనే యథాస్థితికి వస్తుంది. నొక్కిన చోట వేలిముద్ర ఉండిపోయినా, నీళ్లలాంటి ద్రవం కారినా అది పాడైపోయినట్లు భావించాలి.

కొవ్వు ఎలా ఉండాలి..?

మంచి మాంసంలోని కొవ్వు సాధారణంగా తెల్లగా, నునుపుగా, కొద్దిగా మెత్తగా ఉంటుంది. కొవ్వు పసుపు రంగులో లేదా మరీ గట్టిగా ఉంటే జాగ్రత్తగా పరిశీలించాలి.

దుకాణం, ప్యాకేజింగ్ జాగ్రత్తలు

దుకాణం పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఈగలు ముసిరేలా, దుర్వాసన వచ్చేలా ఉన్నచోట మటన్ కొనకూడదు. ప్యాకెట్లలో మటన్ తీసుకుంటే ఎక్స్‌పైరీ తేదీ, లేబుల్ చూడాలి. ప్యాకెట్‌లో నీరు కారడం లేదా మంచు గడ్డలు పేరుకుపోవడం వంటివి లేకుండా చూసుకోవాలి.

ఎక్కువగా కొనొద్దు.. వండే ముందు ఇలా చేయండి

డిస్కౌంట్ ఆఫర్ల పేరుతో అవసరానికి మించి ఎక్కువ మటన్ కొని నిల్వ ఉంచడం మంచిది కాదు. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. వండే ముందు చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, కాసేపు నిమ్మరసం లేదా వెనిగర్‌లో నానబెట్టడం వల్ల బ్యాక్టీరియా తగ్గి, ముక్కలు మరింత రుచిగా ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *