ప్రముఖ నటుడు మురళీ మోహన్ తన ఆరోగ్య రహస్యాలను, ముఖ్యంగా రక్తపోటు (బీపీ), షుగర్ (డయాబెటిస్) వంటి సాధారణ ఆరోగ్య సమస్యలపై తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన 84 ఏళ్ల వయసులోనూ తన జీవనశైలి, ఆరోగ్య స్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా వివరించారు. తన ఆరోగ్యానికి ప్రధాన కారణం ప్రతిరోజూ ఉదయం తాగే రాగి జావా అని ఆయన తరచుగా చెబుతుంటారు. ఇది ఎముకల బలానికి, శక్తికి ఎంతో మేలు చేస్తుందని ఆయన నమ్మకం. ఏది తిన్నా చాలా పరిమితంగా, మితంగా తింటారు. రాత్రిపూట చాలా తేలికపాటి ఆహారం (లైట్ డిన్నర్) తీసుకుంటానని అన్నారు. వీలైనంత వరకు నూనె వస్తువులకు, అతిగా ఉండే మసాలాలకు దూరంగా ఉండటం ఆయన అలవాటని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు నడవడం ఆయన దినచర్యలో భాగమని తెలిపారు. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెప్పుకొచ్చారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగా , ప్రాణాయామం చేస్తారు. శ్వాసపై నియంత్రణ ఉండటం వల్ల ఆయుష్షు పెరుగుతుందని ఆయన అంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకుని, ఎప్పుడూ అలవాట్లకు బానిస కాలేదని ఆయన చెబుతారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం ఆయన అందానికి మరియు ఆరోగ్యానికి అసలు రహస్యమని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
షుగర్ విషయానికి వస్తే, తన కుటుంబంలో ఎవరికీ వంశపారంపర్యంగా షుగర్ లేదని మురళీ మోహన్ పేర్కొన్నారు. తన తండ్రికి, తల్లికి, తనకు, తన కుమారుడికి, కుమార్తెకు షుగర్ లేదని స్పష్టం చేశారు. అయితే, తన కోడలికి, తన భార్యకు స్వల్పంగా షుగర్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది తన కుటుంబంలో షుగర్ సమస్య వంశపారంపర్యంగా లేదనే విషయాన్ని సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..