Mrunal Thakur: తెలుగింటి కోడలిగా మృణాళ్ ఠాకూర్! అల్లు అరవింద్ మాటలకు హీరోయిన్ రియాక్షన్ చూశారా? వీడియో

Mrunal Thakur: తెలుగింటి కోడలిగా మృణాళ్ ఠాకూర్! అల్లు అరవింద్ మాటలకు హీరోయిన్ రియాక్షన్ చూశారా? వీడియో


Mrunal Thakur: తెలుగింటి కోడలిగా మృణాళ్ ఠాకూర్! అల్లు అరవింద్ మాటలకు హీరోయిన్ రియాక్షన్ చూశారా? వీడియో

అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ. 28 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో డెకాయిట్ చిత్ర బృందం ఆదివారం (ఏప్రిల్ 12) సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాఠ్ ఠాకూర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠిని మెచ్చుకుంటూ నువ్వు తెలుగింటి కోడలివైతే బాగుండు అని సరదాగా అన్నారు. మరి ఆయన తెలిసి అన్నారో తెలియక అన్నాడో ఏమో కానీ లావణ్య మెగా ఫ్యామిలీకి కోడలైపోయింది. ఇప్పుడు ఇదే సంఘటనను గుర్తు చేస్తూ మృణాళ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు అల్లు అరవింద్.

‘మృణాల్.. నీకు ఒక మాట చెప్పాలి. నువ్వు చాలా అద్భుతంగా నటిస్తున్నావు. నువ్వు మాకు కావాలి. నీ గ్లామర్, నీ యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ‘గతంలో ఓ అమ్మాయిని (లావణ్య త్రిపాఠీ)ని ఇలాగే దీవించాను. ఆమె వరుణ్ ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోయింది. అందుకే నీకు నా తరఫున ఒక చిన్న సలహా.. నువ్వు ఎలాగైనా ఒక తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. అప్పుడు నువ్వు ఇక్కడే సెటిలైపోవచ్చు.. మా టాలీవుడ్ హీరోయిన్‌గా శాశ్వతంగా ఉండిపోవచ్చు’ అని నవ్వుతూ అన్నారు. అల్లు అరవింద్ మాటలకు మృణాళ్ సిగ్గుపడిపోయింది. ముఖమంతా ఎర్రబడిపోయి ముసిముసిగా నవ్వేసింది. స్టేజ్ మీదున్న మిగతా సెలబ్రిటీలు కూడా అరవింద్ మాటలకు నవ్వుల్లో మునిగిపోయారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అరవింద్ గారు కరెక్ట్‌గా చెప్పారు.. మృణాల్ మా తెలుగు కోడలు కావాల్సిందే! ‘ మరి మృణాళ్ కు కాబోయే జోడీ ఎవరు’ అంటూ అప్పుడే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు నెటిజన్లు.

అల్లు అరవింద్ కామెంట్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *