Mouthwash Side Effects: మౌత్‌వాష్‌తో గుండెకు చేటు..! మీరు వాడుతున్నారా? జాగ్రత్త..

Mouthwash Side Effects: మౌత్‌వాష్‌తో గుండెకు చేటు..! మీరు వాడుతున్నారా? జాగ్రత్త..


Mouthwash Side Effects: మౌత్‌వాష్‌తో గుండెకు చేటు..! మీరు వాడుతున్నారా? జాగ్రత్త..

నేటి కాలంలో నోటి పరిశుభ్రత కోసం చాలా మంది మౌత్‌వాష్ వాడుతుంటారు. ముఖ్యంగా యువతలో దీని వాడకం ఒక ట్రెండ్‌గా మారుతోంది. అయితే, మౌత్‌వాష్‌ను అధికంగా వాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మౌత్‌వాష్ వాడటాన్ని కొందరిలో వ్యసనంలా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్లినా తమ టూత్‌బ్రష్‌తో పాటు దానిని కూడా తీసుకువెళ్తుంటారు. దీనిని వాడటం నేటి కాలంలో అలవాటుగా మారిపోతుంది. కానీ దాని వాడకం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల్లో ఏం బయటపడింది? మౌత్‌వాష్ వాడితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పరిశోధన ఏమి చెబుతోంది?

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మన నోటిలో అనేక మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడతాయి. రక్తనాళాలను సడలించడంలో, రక్తపోటును నియంత్రించడంలో నైట్రిక్ ఆక్సైడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, కొన్ని మౌత్‌వాష్‌లలోని బలమైన యాంటీ బాక్టీరియల్ రసాయనాలు ఈ మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. దీనివల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గి, అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది.

అన్ని మౌత్‌వాష్‌లు హానికరమైనవేనా?

అన్ని మౌత్‌వాష్‌లు ప్రమాదకరమైనవి కావు. బలమైన యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఉన్న మౌత్‌వాష్‌లు మాత్రమే సమస్యలను కలిగిస్తాయి. తేలికపాటి తక్కువ రసాయనాలు ఉన్న మౌత్‌వాష్‌లను క్రమం తప్పకుండా వాడొచ్చు. అయితే వీటిని మితంగా మాత్రమే ఉపయోగించడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మౌత్‌వాష్ ఉపయోగించే వారికి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నోటిలోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి..

  • రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం
  • ఫ్లాసింగ్ సాధన చేయడం
  • సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా దంత పరీక్ష చేయించుకోవడం
  • వైద్యుడు సూచించిన విధంగా మాత్రమే మౌత్ వాష్ వాడకం

రిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *