Headlines

Moral Story: బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితోనే దెబ్బకొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ

Moral Story: బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితోనే దెబ్బకొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ


అనగనగా ఒక అందమైన అడవిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు కలిసి జీవించేవి. ఆ అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గర ఒక కొంగల జంట నివసించేది. ఆ రెండు కొంగలు ఎంతో ప్రేమగా, సంతోషంగా తమ జీవితాన్ని గడిపేవి. కొంతకాలానికి ఆడ కొంగ గుడ్లు పెట్టింది. తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంతో ఆ కొంగల జంట చాలా సంతోషించింది. తమ పిల్లలు పుట్టబోతున్నారని కలలు కంటూ, ఆ గుడ్లను కంటికి రెప్పలా కాపాడుకునేవి. ప్రతి రోజు మగ కొంగ ఆహారం కోసం బయటకు వెళ్లేది. ఆడ కొంగ గూడు దగ్గర ఉండి గుడ్లను కాపాడేది. ఇద్దరూ తమకు పుట్టబోయే పిల్లల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉండేవి.

అదే అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా మోసపూరితమైనది, దురాశ కలిగినది. ఇతర జంతువులకు ఇబ్బంది కలిగిస్తూ, తన స్వార్థం కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడేది కాదు. ఒక రోజు నక్క ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. అక్కడ ఉన్న కొంగ గూడును చూసింది. గూడులో ఉన్న గుడ్లను చూసి దాని నోట్లో నీళ్లు వచ్చాయి. ‘ఇవి నాకు మంచి ఆహారం అవుతాయి’ అని అనుకుంది. కొంగలు లేని సమయం చూసి నక్క చెట్టు ఎక్కి ఒక గుడ్డును తీసుకుని వెళ్లి తినేసింది. కొంతసేపటికి కొంగలు తిరిగి వచ్చాయి. గూడులో ఒక గుడ్డు కనిపించకపోవడంతో అవి చాలా బాధపడ్డాయి. ‘మన పిల్లలను ఎవరో నాశనం చేస్తున్నారు. దీనికి కారణం ఎవరో తెలుసుకోవాలి’ అని కొంగలు అనుకున్నాయి. అయితే కొద్ది రోజుల తర్వాత నక్క మళ్లీ అదే పని చేసింది. ఈసారి కూడా కొంగలు లేని సమయంలో వచ్చి మరో గుడ్డును తీసుకెళ్లింది. తమ పిల్లలను కోల్పోయిన కొంగల బాధ వర్ణించలేనిది. కొంగలు చాలా బాధపడ్డాయి. కానీ ఏడుస్తూ కూర్చోకుండా, తమకు అన్యాయం చేసిన నక్కకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాయి. కొంగలు ఆలోచించి ఒక పథకం వేశాయి.

నక్క ఎప్పుడూ తన తెలివితేటలపై గర్వపడేది. ఇతరులను మోసం చేయగలనని అనుకునేది. అదే దాని బలహీనత అని కొంగలు గుర్తించాయి. అడవిలోని బలమైన జంతువుల దృష్టిని ఆ వైపు మళ్లించాలని అనుకుంటాయి. ఒక రోజు సింహం తన గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కొంగలు ఒక ఉపాయం చేశాయి. వెంటనే సింహం గుహ వద్దకు వెళ్లి ‘నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని’ చెప్పాయి. ‘ఎవరి వల్ల ప్రమాదం ఉంది?’ అని సింహం ప్రశ్నించగా.. సింహం గుహ వద్దకు వెళ్లి దాన్ని చంపుతానని ఓ నక్క సవాల్‌ చేసింది అని చెబుతాయి. ఆ మాటలు విన్న సింహం పగలబడి నవ్వుతుంది. ‘ఓ నక్క నన్ను చంపండం ఏంటీ..’ అని. ‘సరే తీసుకురండి ఆ నక్కను’ అని కొంగలకు చెబుతుంది. ఆ తర్వాత నక్క గుహ సమీపంలోకి వెళ్లిన కొంగలు.. ‘మన గుడ్లు ఆ గుహలో దాచుకుందాం. ఇప్పటికే 12 గుడ్లు దాచాం కదా.. ఇకపై మిగిలిన గుడ్లు కూడా అక్కడే దాచుకుందాం’ అని నక్క వినేలా కొంగలు మాట్లాడుకున్నాయి.

ఆ మాటలు విన్న ఎగిరి గంతేస్తుంది. వెంటనే కొంగల వెంట నక్క కూడా వెళ్తుంది. సింహం గుహ దగ్గర కొంగలు ప్రమాదం ఉన్నట్లు పరిస్థితిని సృష్టించిన సంగతి తెలియని నక్క.. నేరుగా సింహం గుహలోకి వెళ్లింది. నక్కను చూడగానే వెంటనే సింహం దానిపైకి దూకి పీక కొరికి చంపుతుంది. అది చూసి కొంగల జంట ఆనంద పడతాయి. నక్క చేసిన తప్పుకు ప్రతిఫలం అనుభవించింది. ఇతరులకు నష్టం కలిగించడం వల్ల చివరికి తనకే ప్రమాదం వస్తుందని తెలుసుకుంది. తన దురాశ, స్వార్థం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతూ చనిపోతుంది. ఆ రోజు నుంచి అడవిలో జంతువులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవించసాగాయి.

నీతి

ఇతరులకు కీడు చేయాలని చూసేవారికి చివరికి అదే కీడు తిరిగి వస్తుంది. దురాశ, మోసం ఎక్కువ కాలం నిలవవు. తెలివిని మంచి పనులకు ఉపయోగించాలి. ఈ కథలో నక్క తన దురాశ, స్వార్థం వల్ల తన జీవితాన్నే నాశనం చేసుకుంది. ఇతరుల బాధను పట్టించుకోకుండా, తన ఆకలి కోసం అమాయకమైన కొంగల గుడ్లను దొంగిలించింది. తన తెలివితేటలపై ఎక్కువగా గర్వించి, ఎవరినైనా మోసం చేయగలనని భావించింది. కానీ చివరికి అదే అహంకారం, దురాశ దాని పతనానికి కారణమయ్యాయి.ఇతరులకు హాని చేస్తే ఆ హాని తిరిగి మనకే వస్తుంది. ఎవరినైనా బాధపెట్టి, నష్టం కలిగించి సంతోషపడకూడదు. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. చెడు పనులకు ఎప్పటికైనా చెడు ఫలితమే ఎదురవుతుంది. దురాశ మనిషిని తప్పుదారిలో నడిపిస్తుంది. నక్కకు ఆహారం దొరికినా, మరింత కావాలనే ఆశతో కొంగల గుడ్లను దొంగిలించింది. అవసరానికి మించి ఆశపడటం చివరకు ప్రమాదాన్ని తెస్తుంది.

అలాగే తెలివిని మంచి పనులకు ఉపయోగించాలి. తెలివితేటలు ఒక గొప్ప శక్తి. వాటిని ఇతరులను మోసం చేయడానికి కాకుండా, మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి. కొంగలు తమ తెలివిని ఉపయోగించి నక్కకు గుణపాఠం నేర్పాయి. అహంకారం పతనానికి దారి తీస్తుంది. నక్క తనను తాను చాలా తెలివైనదిగా భావించింది. ఎవరూ తనను మోసం చేయలేరని అనుకుంది. కానీ తన అహంకారం వల్ల కొంగల పథకాన్ని అర్థం చేసుకోలేకపోయింది. కష్టాల్లో ధైర్యంగా ఆలోచించాలి. కొంగలు తమ గుడ్లను కోల్పోయి బాధపడినా, నిరాశ చెందలేదు. ఆలోచించి, సమస్యకు పరిష్కారం కనుగొన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *