చంద్రుడు తన స్వస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశులకు తప్పకుండా మనసులోని కోరికలను, ఆశయాలు, ఆశలను నెరవేరుస్తాడు. ఈ నెల(నవంబర్ 2026) 28, 29, 30 తేదీల్లో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులవారు విశేషంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఆ మూడు రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, ప్రాజెక్టులు, చేపట్టే ప్రయత్నాలు 15 రోజుల లోపు తప్పకుండా ఉత్తమ ఫలితాలనిస్తాయి. సానుకూల దృక్పథంతో కొత్త లక్ష్యాలను చేపట్టడం మంచిది. ఆదాయ, ఆరోగ్య ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.