MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించి, ఈ సీజన్‌లో తమ అజేయ ప్రస్థానాన్ని కొనసాగించింది. క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ వృథా కాగా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభసిమ్రాన్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.