Headlines

Malla Reddy Biopic: తెరపైకి మల్లారెడ్డి బయోపిక్.. ఆయన పాత్రలో నటించేది..?

Malla Reddy Biopic: తెరపైకి మల్లారెడ్డి బయోపిక్.. ఆయన పాత్రలో నటించేది..?


​రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. “పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. సక్సెస్ అయ్యా” అంటూ ఆయన చెప్పే డైలాగులు రాష్ట్రవ్యాప్తంగా ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆయన బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. మల్లారెడ్డి అనుమతితో, ఆయన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుండటం విశేషం. ముఖ్యంగా ఆయన కోడలు ప్రీతి రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాలో మల్లారెడ్డి ప్రారంభ దశలో చేసిన పాల వ్యాపారం, పూల బిజినెస్ నుంచి నేడు దేశవ్యాప్తంగా విస్తరించిన విద్యాసంస్థలు, యూనివర్సిటీల వరకు ప్రతి అంశాన్ని స్పృశించనున్నారు. ఒక సామాన్యుడు కష్టపడి ఎలా ఎదిగాడనే కోణంలో ఈ కథ సాగుతుంది. సినిమాలో మల్లారెడ్డి మార్క్ మేనరిజమ్స్, ఆయన ట్రేడ్ మార్క్ స్టెప్పులు, స్పీచ్‌లను హైలైట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఆయన లైఫ్ స్టోరీపై ఒక ప్రత్యేక సాంగ్‌ను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

​మల్లారెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయన బాడీ లాంగ్వేజ్‌ను ప్రతిబింబించేలా ఉండే ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ కోసం వేట మొదలైంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలను వెల్లడిస్తామని సోషల్ మీడియా టీం స్పష్టం చేసింది. రాజకీయాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిగత కృషి, పట్టుదలపైనే ఈ సినిమా ఫోకస్ చేయనుంది. ఈ ఏడాది చివరకల్లా ఈ ‘మాస్ బయోపిక్’ను థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోంది.

ఆటో కావాలా మేడం అంటూ ఆటో ఎక్కించుకుని… ఆ మహిళను 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *