Lenin Movie : పెద్ది కోసం లెనిన్ మూవీ వాయిదా.. రిలీజ్ డేట్ చెప్పిన నాగార్జున..

Lenin Movie : పెద్ది కోసం లెనిన్ మూవీ వాయిదా.. రిలీజ్ డేట్ చెప్పిన నాగార్జున..


అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తాజాగా అక్కినేని నాగార్జున స్వయంగా తెరదించారు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పెద్ది కోసం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ విడుదల విషయంలో వస్తున్న రూమర్లపై నాగార్జున ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

‘లెనిన్’ చిత్రం జూన్ 26న విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కట్ చూశానని, ఇది అఖిల్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. “మీరు ఈ సినిమాలో సరికొత్త అఖిల్‌ను చూస్తారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది” అని నాగార్జున పోస్ట్ చేశారు. నిజానికి ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించింది. అయితే, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతున్నట్లు ప్రకటించడంతో, బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించడానికి ‘లెనిన్’ను జూన్ 26కు వాయిదా వేశారు. మళ్ళీ ‘పెద్ది’ సినిమా కూడా జూన్ 25కు వాయిదా పడటంతో, ‘లెనిన్’ మరోసారి వెనక్కి వెళ్తుందేమో అన్న చర్చ మొదలైంది. కానీ, నాగార్జున ప్రకటనతో ఈ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని ఖరారైంది.

చిత్తూరు నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ రూపొందుతోంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. అఖిల్ తన మేకోవర్ కోసం పడ్డ శ్రమ పోస్టర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. బలమైన భావోద్వేగాలు, ఆసక్తికరమైన కథనంతో వస్తున్న ఈ చిత్రం అఖిల్‌కు మాస్ హీరోగా మంచి బ్రేక్ ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

నాగార్జున ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *