Kulfi: ఇలా ఇంట్లోనే నోరూరించే కుల్ఫీలు తక్కువ ఖర్చుతో రుచిగా చేసుకోవచ్చు.. అస్సలు వదిలిపెట్టరు

Kulfi: ఇలా ఇంట్లోనే నోరూరించే కుల్ఫీలు తక్కువ ఖర్చుతో రుచిగా చేసుకోవచ్చు.. అస్సలు వదిలిపెట్టరు


వేసవి కాలం వచ్చిందంటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చల్లని ఐస్‌క్రీమ్‌లు లేదా కుల్ఫీల కోసం వెతుకుతుంటారు. అయితే బయట దొరికే కుల్ఫీల్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయని ఆందోళన చెందేవారు, కేవలం ఇంట్లో ఉండే పాలతోనే అచ్చం బయట దొరికే రుచితో కుల్ఫీలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా బాదం కుల్ఫీ, మలై కుల్ఫీలను తయారు చేయడం చాలా సులభం.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు రాయొచ్చు..

బాదం కుల్ఫీ కోసం బాదం పప్పులను నానబెట్టి, పొట్టు తీసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. పాలను బాగా మరిగించి, అందులో ఈ బాదం పేస్ట్, పంచదార, కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కలిపితే కుల్ఫీ మిశ్రమం సిద్ధమవుతుంది. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్స్‌లో పోసి 8 గంటల పాటు ఫ్రీజ్ చేస్తే ఎంతో రుచికరమైన బాదం కుల్ఫీ మీ ముందుకు వస్తుంది. ఇందులో కుంకుమపువ్వు వేస్తే మంచి రంగు, వాసన వస్తుంది.

ఇక మలై కుల్ఫీ విషయానికి వస్తే.. దీనికి కేవలం పాలు, పంచదార, యాలకుల పొడి ఉంటే సరిపోతుంది. పాలను సగం కంటే తక్కువ అయ్యే వరకు(అంటే వంతుడు వచ్చే వరకు) బాగా మరిగించాలి. పైన పేరుకున్న మీగడను పాలల్లోకి కలుపుతూ మరిగిస్తేనే కుల్ఫీకి ఆ ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చి, మోల్డ్స్‌లో పోసి ఫ్రీజ్ చేయాలి. ఎలాంటి క్రీమ్ లేదా బీటర్లు వాడకుండానే అత్యంత సాఫ్ట్‌గా ఉండే మలై కుల్ఫీని మీరు ఆస్వాదించవచ్చు. ఈ వేసవిలో ఈ హెల్తీ కుల్ఫీలను ప్రయత్నించి కుటుంబంతో కలిసి లాగించేయండి.

ఇది చదవండి: అప్పుగా ఇచ్చిన వ్యక్తి తీర్చకుండా చనిపోతే.. ఇలా చేస్తే డబ్బు ఇంటికి ఈజీగా తిరిగి వస్తుంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *