వేలం నుంచి వచ్చిన సొమ్ములో బ్యాంక్ తన బకాయిలను తీసుకుని మిగతా సొమ్మును రైతులకు తిరిగి ఇస్తుంది. అయినా కొన్ని అనివార్య పరిస్థితుల్లో బ్యాంకులు రైతుల భూమిని వేలం వేయవు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, ప్రభుత్వం రుణమాఫీ చేయడం, బీమా క్లెయిమ్స్ వంటి పరిస్థితుల్లో భూమిని జప్తు చేయడం లేదా వేలం పాట నిర్వహించడం లాంటివి ఉండవు. రైతుల రుణాల విషయంలో బ్యాంకులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవు.