హీరోగా ఉన్నపుడు దర్శకుడిగా సినిమాలు చేయడం కష్టం.. దర్శకుడిగా ఉన్నపుడు నిర్మాతగా అన్నీ చక్కబెట్టడం కష్టం.. ఒకేసారి ఒకే మనిషి రెండు మూడు పనులు చేయాలంటే కష్టమే. కానీ టాలీవుడ్లో ఒకరు అది చేస్తూ పోతున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ వరస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రొడక్షన్ నుంచి మరో సినిమా వస్తుంది. ఆయనెవరో తెలుసా..? కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్లో బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. మూడేళ్ళ కింద హీరోగా నిలదొక్కుకోడానికి చాలా ప్రయత్నాలు చేసిన ఈయనే ఇప్పుడు చాలా మంది నిలదొక్కుకోడానికి సాయం చేస్తున్నారు. క, కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ లాంటి విజయాలతో కిరణ్ రేంజ్ పెరిగింది. అలాగే నిర్మాతగానూ తిమ్మరాజుపల్లి లాంటి పల్లెటూరి కథతో వచ్చారు. ఇప్పుడు హత: అంటూ హార్రర్ సినిమాతో వస్తున్నారు. కిరణ్ అబ్బవరం KA ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న హత: సినిమాను అనూష్ గోరక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కుష్లు మడ్డాల, రెహమాన్, నమ్రిత, తనూజ పుట్టస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్కు బాగా కలిసొచ్చిన దివాళి సీజన్లో నవంబర్ 6న హత: విడుదల కానుంది. అలాగే నిర్మాతగానే కాదు.. దర్శకుడిగానూ KA13 సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరోగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ బిజీగానే ఉన్నారు కిరణ్. గతంలో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు కథ, మాటలు రాసిన కిరణ్.. ఈసారి డైరెక్షన్ కూడా చేస్తున్నారు. మరోవైపు తన ప్రొడక్షన్లో కొత్త వాళ్లకి ఛాన్స్ ఇస్తూ మంచి కథలను ఎంకరేజ్ చేస్తున్నారు. మొత్తానికి ఆల్రౌండర్లా అలా వెళ్తున్నారు ఈ హీరో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీగా పెరగనున్న బియ్యం, చక్కెర ధరలు
కవల పిల్లల తల్లి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!
ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే