Headlines

Kamal Haasan : ప్రతి కుర్రాడి మనసుకు టచ్ అయ్యే సీన్.. అబ్బాయి జీవితాన్ని తెలిపే డైలాగ్.. మీరు విన్నారా.. ?


తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రాల్లో ‘ఆకలి రాజ్యం’ ఒకటి. కె. బాలచందర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. సమాజంలోని నిరుద్యోగం, పేదరికం, ఆకలి కేకలను అత్యంత సహజంగా తెరపై చూపించారు. చదువు పూర్తైన నిరుద్యోగం వెంటాడుతున్న ఓ యువకుడు.. సమాజంలోని అన్యాయాన్ని సహించలేక పడే మానసిక వేదనే ఈ మూవీ. ఈ సినిమాలోని ప్రతి కమల్ హాసన్ (జేఆర్‌కే) ,శ్రీదేవి (దేవి) మధ్య సాగే ఒక ప్రత్యేక సన్నివేశం ప్రేక్షకులను ఇప్పటికీ తీవ్రంగా కలచివేస్తుంది. ఈ సన్నివేశంలో కమల్ హాసన్ తను ప్రాణంగా భావించే మహాకవి శ్రీశ్రీ పుస్తకాలను కనీసం అమ్మడానికి కూడా కాకుండా, కేవలం తుక్కు కింద తూకానికి ఇచ్చేస్తాడు. తను ఎంతో గౌరవించే కవిత్వ విలువ కేవలం మూడు రూపాయల కేజీగా మారిపోవడం ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తుంది.

ఇవి అతనికి ప్రాణ సమానమైనవి, తన ఒంటరి జీవితంలో తోడుగా నిలిచినవి. ఒక పుస్తకాల కొనుగోలుదారుడు మంచి పుస్తకం అని చెప్పినా, “చదవడానికే కానీ మరవడానికి పనికి రాదండీ. అప్పడాలా నలిగిపోతుంది,” అంటాడు. అతనికి స్టార్ డస్ట్, ఫిల్మ్ ఫేర్ వంటి పత్రికలు మాత్రమే గిరాకీ అని అంటాడు. తాను ప్రాణప్రదంగా భావించిన శ్రీశ్రీ పుస్తకాలను తూకానికి కేవలం మూడు రూపాయలకు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఆ కమల్ పడే ఆవేదన వర్ణనాతీతం. “విప్లవ కవి, శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ, మూడు రూపాయలు,” అని స్వీయ విమర్శ చేసుకుంటాడు. శ్రీశ్రీ తన దైవమని, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి అని, అది “omnipresent and the omnipotent” అని తన ఆవేదనను వెళ్లగక్కుతాడు. “ఆకలేసి కేకలేశాను అన్నాడు శ్రీశ్రీ,” అన్న తన మాటలతో కవి ఆకలిపై పలికిన పలుకులను గుర్తుచేస్తాడు. తాను నమ్ముకున్న ఆదర్శాలను, సిద్ధాంతాలను, చివరికి మానాభిమానాలను కూడా ఆకలి అమ్ముకోమంటుందని చెబుతాడు.

తను సంపాదించిన మూడు రూపాయలు కూడా సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గర మిఠాయి పొట్లాలు కట్టడానికి పోతాయని, తన బాల్యం నుంచి తండ్రికి “నా బతుకు నేనే బతుకుతాను” అని చెప్పిన ఆదర్శాలు, ఇప్పుడు ఆకలి ముందు నిష్ప్రయోజనమని అరుస్తాడు. “ఎలాగైనా బతకాలనుకుంటే ఎలాగోలా బతికేద్దును. కానీ ఇలాగే బతకాలనుకున్నాను. అది వీలుపడదు ఈ దేశంలో,” అంటూ వ్యవస్థపై తన అసంతృప్తిని వెల్లడిస్తాడు. తన చుట్టూ ఉన్న స్వార్థాన్ని సహించలేక ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయానని చెబుతాడు.

అయితే, తన ఆశయాలను, ఆదర్శాలను నాశనం చేసుకోనని, కానీ తన తోడున్న శ్రీదేవి పాత్రను మాత్రం ఈ “ఆకలి యజ్ఞంలో సమిధను కానివ్వను” అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఆమెకు ఒక పూట భోజనం ఇవ్వగలనన్న నమ్మకం శ్రీశ్రీ పుస్తకాలను అమ్ముకున్న తర్వాత పోయిందని, తన జీవితం తను బ్రతకాలని, సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు ఈ పిచ్చివాణ్ణి తలచుకోమని అంటాడు. ఈ దృశ్యం కేవలం ఒక సినిమా సన్నివేశం మాత్రమే కాదు, ఆకలి, పేదరికం, ఆదర్శాలు, మనుగడ కోసం మానవుడు చేసే పోరాటంపై ఒక లోతైన సామాజిక వ్యాఖ్యానం. కమల్ హాసన్ నటన ఈ సన్నివేశానికి జీవం పోసింది.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

ఆకలి రాజ్యం సీన్..



ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *