దర్శకుడు శంకర్ తొలి చిత్రంగా తెరకెక్కి, 1993లో విడుదలై సంచలన విజయం సాధించిన కల్ట్ క్లాసిక్ ‘జెంటిల్‌మెన్’. ఈ మూవీ వెనుక అనేక ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. విద్యా రంగంలోని అవినీతి, ఆర్థిక అసమానతలను ప్రశ్నిస్తూ రూపొందిన ఈ చిత్రం అప్పట్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా నిర్మాత కె.టి. కుంజుమోన్ పంచుకున్న విశేషాలు సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ‘జెంటిల్‌మెన్’ కథను మొదట విశ్వనటుడు కమల్ హాసన్ కు వినిపించారని నిర్మాత కుంజుమోన్ వెల్లడించారు. అయితే ఆ కథ కమల్‌కు నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయిందని తెలిపారు. ఆ తర్వాత శరత్‌కుమార్‌ను హీరోగా అనుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చినప్పటికీ, డేట్స్ సమస్యల వల్ల ఆయన కుదరలేదని వివరించారు. చివరకు యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలోకి వచ్చారని, శంకర్ పట్టుదల, కథలోని బలంతో ఈ చిత్రం పట్టాలెక్కిందని గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..
1993 కాలంలోనే హెలికాప్టర్ సన్నివేశాలు, భారీ యాక్షన్ సీక్వెన్సులు, రిచ్ లొకేషన్లు, అద్భుతమైన పాటల చిత్రీకరణ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు కుంజుమోన్ తెలిపారు. ఏ.ఆర్. రెహమాన్ స్వరపరచిన పాటలు, ముఖ్యంగా ‘చిక్కు బుక్కు రైలే’ వంటి గీతాలు దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందాయో అందరికీ తెలిసిందే. తొలుత డిస్ట్రిబ్యూటర్ల నుంచి సందేహాలు ఎదురైనా, విడుదల తర్వాత థియేటర్లలో ఘనవిజయం సాధించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వంటి వారికి కూడా ఈ సినిమా స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..