హైదరాబాద్, ఏప్రిల్ 20: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 11.23 లక్షల మంది నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. సోమవారం (ఏప్రిల్ 20) జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు jeemain.nta.nic.in లేదా nta.ac.inలోఅభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డుతోపాటు తుది ఆన్సర్ కీ, కట్-ఆఫ్ మార్కులను కూడా ఎన్టీయే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు కూడా వెలువడ్డాయి.
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దేశ వ్యాప్తంగా 304 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 11.23 లక్షల మంది హాజరయ్యారు. ఇక తొలి విడతలో 14 లక్షలకుపైగా అభ్యర్ధులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్ జనవరి, ఏప్రిల్ సెషన్లు రెండు సెషన్లకు హాజరైన వారికి ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ఆల్ ఇండియా ర్యాంకును కేటాయించారు. ఈ జాబితాలో తొలి 2.50 లక్షల ర్యాంకర్లను మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు.
ఇవి కూడా చదవండి
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏప్రిల్ 21 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రిజిస్ట్రేషన్లు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన వారి కోసం ఏప్రిల్ 21 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. అడ్మిట్ కార్డులు మే 11 నుంచి మే 17 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మే 17న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఒకే రోజులో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్ధులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుంది. అనంతరం జోసా కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి మొదలవుతుంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ 2026) రాసేందుకు జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. జూన్ 7న ఏఏటీ 2026 పరీక్ష ఫలితాలు విడుదల వెలువడతాయి.
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.