Headlines

Jana Nayagan Movie: చాలా బాధగా ఉంది.. సీఎం విజయ్ ‘జన నాయగన్’ సినిమాపై త్రిష మదర్ కామెంట్స్ వైరల్

Jana Nayagan Movie: చాలా బాధగా ఉంది.. సీఎం విజయ్ ‘జన నాయగన్’ సినిమాపై త్రిష మదర్ కామెంట్స్ వైరల్


తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ నటించిన ఆఖరి సినిమా ‘జన నాయగన్ ‘ (తెలుగులో ‘జన నాయకుడు’) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో అనూహ్యంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఆ వివాదం ముగియడంతో దాదాపు ఏడు నెలల తర్వాత విజయ్ సినిమా థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య బుధవారం (జులై 23) ‘జన నాయగన్’ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లోనూ విజయ్ సినిమా గ్రాండ్ గా రిలీజైంది. తెలుగులో పెద్ద సందడి లేదు కానీ తమిళనాట విజయ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు థియేటర్లలో ఈ సినిమాను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా సామాన్యులు, అభిమానులతో పాటు హీరోయిన్ త్రిష జననాయగన్ సినిమాను చూసింది. చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వెళ్లిన ఆమె జన నాయగన్‌ సినిమాను ఆస్వాదించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి.

త్రిషతో పాటు ఆమె తల్లి ఉమాకృష్ణన్ కూడా జన నాయగన్ సినిమాను చూశారు. అనంతరం విజయ్ సినిమాపై తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. ‘ విజయ్ నటించిన జన నాయగన్ సినిమా చూసి మేము చాలా ఆనందించాం. థియేటర్లలో ఈ మూవీని ఎంతో ఆస్వాదించాం. కానీ ఇది ఆయన చివరి చిత్రం కావడం చాలా బాధగాఉంది. మేము ఆయనను చాలా మిస్ అవుతున్నాం’ అని ఉమా కృష్ణన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి



జన నాయగన్ సినిమాలో సీఎం విజయ్

‘జన నాయకుడు’ సినిమా విషయానికి వస్తే.. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *