Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర

Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర


Jana Nayagan: జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర

మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటారు కదా.. ఇక్కడ తాటిపండు కాదు ఏకంగా చెట్టే పడుతుంది తమిళ హీరో విజయ్ మీద.. చూస్తుంటే ఈయన టైమ్ అస్సలు బాలేదేమో అనిపిస్తుంది. రాజకీయాల్లోకి వచ్చారనే జన నాయగన్‌ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారా..? సెన్సార్ అడ్డంకులతో ఆగిన సినిమా.. ఇప్పుడెలా లీక్ అయింది..? అసలు దీని వెనక ఏం జరుగుతుంది..?
విడుదలకు ముందే జన నాయగన్ సినిమాకు సంబంధించిన ఇంట్రో, ఒక పాట, జైలు సీన్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. దాదాపు 48 నిమిషాల ఫుటేజ్ బయటికి వచ్చేయడంతో వందల కోట్ల బడ్జెట్ పరిస్థితి ఏంటని నిర్మాతలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఎంతో వివాదాస్పదమైన కేరళ స్టోరీ 2 లాంటి సినిమాలకు వెంటనే క్లియరెన్స్ ఇస్తున్న సెన్సార్ బోర్డ్.. విజయ్ సినిమాను ఎందుకు ఆపిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే కొందరు కావాలని కుట్రలు చేసి సినిమాను ఆపి ఇలా ఆన్‌లైన్‌లో లీక్ చేయించారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ సైతం తన సినిమా వాయిదాపై ప్రభుత్వాన్నే తప్పుబట్టారు. ఇలా విడుదలకు ముందే లీక్ అవ్వడం నిర్మాతలకు కోలుకోలేని షాక్ అని చెప్పాలి.. గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలాగే లీక్ అయి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇండస్ట్రీ అంతా ఒక్కటై పైరసీ భూతం మీద గట్టిగా ఫైట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ చేశారు. మొన్నటికి మొన్న శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమా కూడా ఇలాగే లీక్ అయిందని స్వయంగా హీరో చెప్పడం అందరినీ ఆలోచింపజేస్తోంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా సెక్యూరిటీని బ్రేక్ చేసి విడుదలకి ముందే సినిమాలను ఎలా లీక్ చేస్తున్నారనేది ఇండస్ట్రీని భయపెడుతున్న ప్రశ్న. మొత్తానికి ఈ లీకుల భయం ఇంకెన్నాళ్ళు ఉండాలో మరి..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: దగ్గరవుతున్న త్రిష.. నచ్చలేదంటున్న శ్రుతి !!

Lokah Chapter 2: లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్

TTD Alert: శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి

Adilabad Airport: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

చెన్నై సమీపంలో గోల్డ్ షాపులో దోపిడీకి యత్నం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *