Headlines

Jailer 2: విజయ్‌ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ


రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమాని లెక్క ప్రకారం వచ్చే నెల 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ముందే చెప్పినట్లు అక్టోబరు 15నే ‘జైలర్ 2’ థియేటర్లలో రిలీజ్ కానుందని కొత్తగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదివరకే పూర్ణ చేసిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదలకు మరో నెలన్నర ఉంది కాబట్టి కొన్నిరోజుల తర్వాత ప్రమోషన్లు మొదలుపెడతారేమో అనిపిస్తుంది. ‘జైలర్ 2’కి పోటీగా తెలుగులో విజయ్ దేవరకొండ ‘రణబాలి’, వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ బరిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర దసరాకి మంచి ఫైట్ చూడొచ్చు. 2023లో వచ్చిన ‘జైలర్’ అద్భుతమైన సక్సెస్ అందుకుని రజనీకాంత్‌కి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సూపర్‌స్టార్ పని ఇక అయిపోయింది అనే టైంలో రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌పైనా బజ్ ఓ మాదిరిగా ఉంది. తొలి భాగంలోని నటీనటులు ఇందులోనూ కనిపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *