Headlines

Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!


కాంపిటీషన్ లేదు.. టికెట్ల రేట్ల అసలే లేదు. సినిమాలో దండిగా ఎమోషన్ ఉంది. మాస్ రాజా నెక్ట్స్‌ లెవల్‌ పర్పార్మెన్‌స్ అందర్నీ ఏడిపిస్తోంది. ఇంకేముంది ఇరుముడి సినిమాకు కలెక్షన్స్‌ వరద పారుతోంది. సర్‌ప్రైజింగ్‌లీ ఈ సినిమా ఇప్పుడు 200 మార్క్‌ను కూడా అందుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ఇటీవల ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పించింది. అయ్యప్ప స్వామి మాల బ్యాక్ డ్రాప్ తో, తండ్రి కూతుళ్ళ అనుబంధంతో, అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి అనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఇరుముడి సినిమా చూసి అయ్యప్ప స్వామి పాటలకు వైబ్ అవ్వడమే కాక క్లైమాక్స్ ఎమోషన్ కి ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వస్తున్నారు. డే వన్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఇరుముడి.. నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లోకి వచ్చింది. తాజాగా మూవీ యూనిట్ ఇరుముడి సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ అఫీషియల్‌గా రిలీజ్ అయింది.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇరుముడి సినిమాకు సినిమాకు 25 కోట్లకు పైగా థియేటరికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే కనీసం 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్ అయినట్టే. ఇప్పటికే 200 కోట్లు గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 150 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయి. ఇది మామూలు లాభం కాదుగా.. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 2: విజయ్‌ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ

TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *