IRCTC: సమ్మర్ సెలవుల్లో అరకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే అవకాశం..

IRCTC: సమ్మర్ సెలవుల్లో అరకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే అవకాశం..


సమ్మర్‌లో చిల్ అవ్వడానికి ఆంధ్రా ఊటిగా పేరు పొందిన అరకుకు వెళ్లాలనుకుుంటున్నారా..? స్కూల్స్, కాలేజీలకు సెలవులు రావడంతో చాలామంది అరకు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టూర్ ఎలా ప్లాన్ చేయాలి..? ఎక్కడ బస చేయాలి? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. ట్రైన్, బస్సుల ద్వారా ఎలా వెళ్లాలి..? అనేది తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇక టెన్షన్. ఇలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ తక్కువ ధరలో అరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు ఎలాంటి ఆందోళన పడకుండా అరకు అందాలు చూసి రావొచ్చు.

హైదరాబాద్ టూ అరకు

ఐఆర్‌సీటీసీ జ్యువెల్ ఆఫ్ ఆస్ట్ కోస్ట్ పేరిట హైదరాబాద్ టూ అరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ప్రతీ గురువారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. రవాణా ఛార్జీలతో పాటు వసతి, ఫుడ్ ఖర్చులన్నీ టికెట్‌లోనే కవర్ అవుతాయి. ఈ టూర్‌లో భాగంగా అరకు , బొర్రాగుహలు, సింహాచలం టెంపుల్, కాలీ మాత టెంపుల్, సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, రుషికొండ బీచ్, ట్రైబల్ మ్యూజియం, ఆర్కే బీచ్ వంటివన్నీ సందర్శించవచ్చు. మొత్తం ఐదు రోజలు పాటు టూర్ ఉంటుంది. ట్రైన్, బస్సు, హోటల్ ఫెసిలిటీ కల్పి్స్తారు.

టికెట్ ధరలు ఇవే..

-సింగిల్ షేరింగ్ కంఫర్ట్(థర్డ్ ఏసీ) ధర రూ.27910గా ఉండగా.. డబుల్ షేరింగ్ రూ.17,010, త్రిబుల్ షేరింగ్ రూ.13,370, చైల్డ్ విత్ బెడ్ రూ.8900, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.6270గా ఉంది. ఇక స్టాండర్ట్ స్లీపర్ క్లాస్ ధర సింగిల్ షేరింగ్ రూ.2610, డబుల్ షేరింగ్ రూ.15110, త్రిపుల్ షేరింగ్ రూ.11480గా ఉంది. ఇక చైల్డ్ విత్ బెడ్ రూ.7 వేలు, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.4370గా ఉంది.

-ఇక నాలుగు నుంచి 6గురు ప్యాసింజర్లకు థర్డ్ ఏసీ డబుల్ షేరింగ్ రూ.15,130, ట్రిపుల్ షేరింగ్ రూ.12,790, చైల్డ్ విత్ బెడ్ రూ.8900, చైల్డ్ వితైట్ బెడ్ రూ.6270గా ఉంది. ఇక స్లీపర్ క్లాస్‌కు డబుల్ షేరింగ్ రూ.13240, త్రిపుల్ షేరింగ్ రూ.10890, చైల్డ్ విత్ బెడ్ రూ.7 వేలు, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.4370గా ఉంది.

సందర్శనలు ఇవే..

గురువారం సాయంత్రం 5.05 గంటలకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. శుక్రవారం కాళీ మాత టెంపుల్, సబ్ మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, రుషికొండ బీచ్ సందర్శన ఉంటుంది. శనివారం అరకు, జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం. గలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల సందర్శన ఉంటుంది. ఇక ఆదివారం సింహచలం టెంపుల్, ఆర్కే బీచ్ సందర్శన ఉంటుది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *