Headlines

IPL 2026: కేకేఆర్ శిబిరంలోకి రూ. 18 కోట్ల ప్లేయర్ ఎంట్రీ.. ఇక ప్రత్యర్థులకు వణుకే..!

IPL 2026: కేకేఆర్ శిబిరంలోకి రూ. 18 కోట్ల ప్లేయర్ ఎంట్రీ.. ఇక ప్రత్యర్థులకు వణుకే..!


IPL 2026: కేకేఆర్ శిబిరంలోకి రూ. 18 కోట్ల ప్లేయర్ ఎంట్రీ.. ఇక ప్రత్యర్థులకు వణుకే..!

Mathisha Pathirana KKR Debut: ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో ఘోరంగా విఫలమవుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయలేక చేతికి వచ్చిన విజయాలను జారవిడుచుకుంటోంది. ముంబై ఇండియన్స్‌పై 220 పరుగులు చేసినప్పటికీ బౌలర్లు దానిని కాపాడుకోలేకపోయారు. అలాగే లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుని ఓటమి పాలయ్యారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పతిరానా రాక జట్టుకు కొండంత అండగా మారనుంది.

18 కోట్ల ధర.. భారీ అంచనాలు..

గతేడాది జరిగిన మినీ వేలంలో మతీషా పతిరానాను కేకేఆర్ యాజమాన్యం ఏకంగా 18 కోట్ల రూపాయల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే సీజన్ ఆరంభంలోనే గాయపడటంతో ఆయన మొదటి కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు. ఆయన స్థానంలో వచ్చిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ప్రస్తుతం పతిరానా ఫిట్‌నెస్‌ సాధించడమే కాకుండా, రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే కీలక పోరులో అందుబాటులో ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

పతిరానా రాకతో మారనున్న సమీకరణాలు..

మతీషా పతిరానా తన విలక్షణమైన బౌలింగ్ శైలితో ‘మినీ మలింగ’గా గుర్తింపు పొందాడు. యార్కర్లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ బౌలర్ల ఎకానమీ రేటు ఆందోళనకరంగా ఉంది. ముస్తాఫిజుర్ రెహమాన్ అందుబాటులో లేకపోవడం, ఇతర బౌలర్లు విఫలం కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు పతిరానా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బాధ్యత తీసుకుంటే కేకేఆర్ మళ్ళీ విజయాల బాట పట్టే అవకాశం ఉంది.

రాజస్థాన్‌తో పోరులో అరంగేట్రం..

రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌లో పతిరానా కేకేఆర్ తరపున తన మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. షారుఖ్ ఖాన్ జట్టు ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత అవసరం. మరి 18 కోట్ల స్టార్ బౌలర్ పతిరానా రాకతో కోల్‌కతా రాత మారుతుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *