Headlines

IND vs NZ: ఈసారి మీ ఆటలు సాగవు.. విరాట్-రోహిత్‌లకు న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ వార్నింగ్


IND vs NZ: ఈసారి మీ ఆటలు సాగవు.. విరాట్-రోహిత్‌లకు న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ వార్నింగ్

IND vs NZ: ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 5 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్ జరగనుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు. గతం నుంచి న్యూజిలాండ్ పిచ్‌లపై ఆ ఇద్దరికీ మంచి రికార్డు ఉందనే విషయాన్ని అంగీకరిస్తూనే, ఈసారి పరిస్థితులు వేరేలా ఉంటాయని, వారిని సులువుగా పరుగులు చేయనివ్వబోమని హెచ్చరించాడు.

వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఈ 5 మ్యాచ్‌ల సిరీస్ ఎంతో కీలకమని శాంట్నర్ విశ్లేషించాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు తక్కువగా ఉన్న సమయంలో సరైన జట్టు కలయికను సిద్ధం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని చెప్పాడు. భారత్‌తో సిరీస్ ముగిసిన వెంటనే శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు, 2027 సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ వేదికగా మెగా టోర్నీకి ముందు ఆడే మ్యాచ్‌లు తమకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపాడు. స్వదేశంలో బలమైన భారత్‌ను ఓడించి సిరీస్ గెలవడమే తమ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశాడు.

గతంలో భారత్‌ను వారి సొంతగడ్డపైనే 3-0తో క్లీన్‌స్వీప్ చేసి, 12 ఏళ్ల రికార్డును తిరగరాసిన క్షణాలను శాంట్నర్ గుర్తుచేసుకున్నాడు. నవంబర్‌లో జరగబోయే 2 టెస్టుల సిరీస్ భారత యువ ఆటగాళ్లకు పెద్ద పరీక్షగా మారనుందని అభిప్రాయపడ్డాడు. పూణే టెస్టులో ఏకంగా 13 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించిన శాంట్నర్, న్యూజిలాండ్ పిచ్‌లు పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయని చెప్పాడు. మొదటిసారి న్యూజిలాండ్ గడ్డపై ఎర్ర బంతితో ఆడే యంగ్ ఇండియన్ ప్లేయర్లు ఇక్కడి వాతావరణానికి వేగంగా అలవాటుపడాల్సి ఉంటుందని సూచించాడు.

ప్రత్యర్థి జట్టును హెచ్చరిస్తూనే టీమిండియా బలాన్ని కూడా శాంట్నర్ అంగీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో భారత బౌలింగ్ విభాగం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రశంసించాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ బౌన్స్ శక్తితో వికెట్లు తీయగలరని, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌లతో స్పిన్ విభాగం కూడా బలంగా ఉందని చెప్పాడు. భారత జట్టు అన్ని విభాగాల్లో బాలెన్సింగ్ గా కనిపిస్తోందని విశ్లేషించాడు. స్వదేశంలో భారత్‌ను కట్టడి చేసేందుకు కివీస్ జట్టు వ్యూహాలు రచిస్తుండగా, రోహిత్, విరాట్ తమ బ్యాటింగ్‌తో వారికి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఈ పర్యటన రెండు జట్లకు ప్రపంచకప్ నాటికి సరైన జట్టును సిద్ధం చేసుకునేందుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన వేదికగా మారనుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *