Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..

Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..


హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అయితే, ఈ విస్తరణతో పాటు అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల సమస్య కూడా పెరిగింది. ఇటీవల జరిగిన హైడ్రా కూల్చివేతలు ఆస్తి కొనుగోలుదారులలో అవగాహన ఎంత ముఖ్యమో గుర్తుచేశాయి. హైదరాబాద్ పరిసరాల్లో సురక్షితమైన ఆస్తిని కొనుగోలు చేయడానికి HMDA, DTCP, GHMC అనుమతుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.

HMDA (హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ)

నగర వెలుపలి ప్రాంతాలైన మేడ్చల్, షామీర్‌పేట్, మోకిల, పటాన్‌చెరు వంటి చోట్ల వ్యవసాయ భూములను నివాసయోగ్యమైన ప్లాట్లుగా మార్చడానికి HMDA అనుమతులు ఇస్తుంది. ఇది ప్రధానంగా లేఅవుట్‌లకు ఇచ్చే అనుమతి. ఒక స్థలానికి HMDA అనుమతి ఉందంటే అది భవిష్యత్తులో నిర్మాణాలకు అనుకూలమైన భూమి అని అర్థం. అయితే, ఈ అనుమతి కేవలం లేఅవుట్‌కు మాత్రమేనని, భవన నిర్మాణాలకు విడిగా అనుమతులు తీసుకోవాలని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.

DTCP (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)

మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధి పనులను DTCP పర్యవేక్షిస్తుంది. ఇక్కడ కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు బిల్డర్లు తక్కువ విస్తీర్ణానికి అనుమతి తీసుకుని, దానిని పెద్ద భూభాగానికి వర్తిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి, మీరు కొనాలనుకుంటున్న ప్లాట్ యొక్క సర్వే నంబర్‌కు ఖచ్చితమైన అనుమతులు ఉన్నాయో లేదో స్వయంగా ధృవీకరించుకోవాలి.

GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)

హైదరాబాద్ నగర పరిధిలో జరిగే నిర్మాణాలకు GHMC అనుమతి తప్పనిసరి. నగరంలో దాదాపుగా వ్యవసాయ భూములు లేవు కాబట్టి, ఇక్కడ ప్రధానంగా అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణ అనుమతులు(Building Permissions) కీలకం. అనుమతులతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(OC), మ్యూటేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. నగర పరిధిలోని ఆస్తులలో రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ, పత్రాల ధృవీకరణలో అశ్రద్ధ వహించకూడదు. ఆస్తి కొనుగోలు అనేది జీవితకాల పెట్టుబడి. కాబట్టి, ఏ ప్రాంతంలో ఆస్తి కొంటున్నారో దానికి సంబంధించిన సర్వే నంబర్, లేఅవుట్ అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించాలి. సరైన అవగాహనతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవడం ద్వారానే మీ పెట్టుబడికి భద్రత లభిస్తుంది.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *