Headlines

Hyderabad: మహిళా టెకీకి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డ్..


Hyderabad: మహిళా టెకీకి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డ్..

హైదరాబాద్‌లో మహిళా భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రివేళ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఓ సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఐటీ కారిడార్‌లోని ఇందిరానగర్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ వద్దకు చేరుకుంది. ఆమె క్యాబ్ తలుపు తీసుకుని లోపలికి ఎక్కుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం బాధితురాలు ధైర్యంగా గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌గా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి పూర్తి వివరాలను సేకరించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. నిందితుడిని త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఐటీ కారిడార్‌లో రాత్రి వేళ విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళా ఉద్యోగుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. మహిళల భద్రత కోసం రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని, సెక్యూరిటీ సిబ్బంది నియామకాల్లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను కఠినంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *